ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. రికార్డ్ స్థాయిల వద్ద కూడా తమ జోరును కొనసాగించిన కీలక సూచీలు వారాంతంలో లాభాలతో ముగిసి పాజిటివ్ సంకేతాలను అందించాయి.
ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, టెలికాం కౌంటర్లు మళ్లీ జోరందుకోవడంతో మిడ్ సెషన్ నుంచీ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. దీంతో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడింది. చివరికి సెన్సెక్స్ 112 పాయింట్లు ఎగిసి 33,685 వద్ద నిఫ్టీ 29పాయింట్లు లాభంతో 10,452 వద్ద స్థిరపడింది.

రియాల్టీ, ప్రైవేటు బ్యాంకుల లాభాలు, అలాగే బ్యాంక్ నిఫ్టీ, మీడియా ఇండెక్స్ లాభాలు కూడా మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. అయితే నిన్న లాభాలను గడించిన ఫార్మా రంగం ఈరోజు బలహీనంగానే ముగిసింది.
ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ , బయోకాన్, అదానీ, జెట్ ఎయిరవేస్, అరవింద్ లాభపడగా.. గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, లుపిన్, బీపీసీఎల్, గెయిల్, పవర్‌గ్రిడ్, హీరోమోటో, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్ , శ్రీరామ్ సిటీ, దీపక్ ఫెర్టిలైజర్స్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!