వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడ్ అలర్ట్: మరోసారి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరికి తుఫాను ముప్పు, భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

మరో సారి కేరళకు భారీ వర్ష సూచన

తిరువనంతపురం: గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో ప్రళయ భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శనివారం, ఆదివారాల్లో కేరళ, తమిళనాడుతోపాటు పాండిచ్చేరి రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది.

Red Alert in Kerala, TN & Puducherry Over Cyclonic Conditions

ఈ హెచ్చరికల నేపథ్యం కేరళ సీఎం పినరయి విజయన్‌ తీరంలోని మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీనిపై కేంద్రంతో ఇప్పటికే చర్చలు జరిగిన సీఎం.. వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం విజయన్ బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలకు ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

కేరళలో ఇటీవల సంభవించిన భారీ వర్షలకు 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 30,000 కోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. కాగా, ఇటీవల సంభవించిన వరద బీభత్సం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న కేరళ ప్రజలకు తాజా వర్ష సూచన భయాందోళనకు గురిచేస్తోంది.

English summary
The Kerala government, on Wednesday 3 October, issued a red alert in three districts of the state after Indian Meteorological Department (IMD) warned about a cyclonic depression over the Arabian Sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X