ఎల్ కే అద్వానీ హెల్త్ బులిటెన్ విడుదల..ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే..?
బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించండంతో అద్వానీని ఎమర్జెన్సీకి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో ఈనెల 12 నుంచి అద్వానీ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన న్యూరాలజీ డాక్టర్ల సమక్షంలో ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

అద్వానీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు, ఒకటీ రెండు రోజుల్లో ఐసీయూ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉందని ఆస్సత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతునట్టు, త్వరలోనే అత్యవసర విభాగం నుంచి బయటికి వస్తారని వైద్యులు పేర్కొన్నారు.ఎల్ కే అద్వానీ వయస్సు కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు అనారోగ్యం తీవ్రమైనప్పుడు ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులు తగిన చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications