న్యూ ఇయర్ ధమాకా ఆఫర్..!!

ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో తన ట్రూ 5జీ సేవలను మరింత విస్తరించనుంది. కొత్త సంవత్సరంలో ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. మరో 11 నగరాల్లో రిలయన్స్ జియో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకుని రానుంది. మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందుగానే ఈ సేవలను యూజర్లకు అందించనుంది ఆ 11 నగరాల్లో కూడా. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసిందా సంస్థ యాజమాన్యం.

ఇప్పటికే పలు చోట్ల

ఇప్పటికే పలు చోట్ల

దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ రిలయన్స్ జియో యాజమాన్యం తన ట్రూ 5జీ సేవలను దశలవారీగా విస్తరించుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. తొలిదశలో ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ఈ సేవలను ప్రవేశపెట్టింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో ఈ సేవలు తొలివిడతలో మొదలయ్యాయి. ఢిల్లీ, గుర్‌గావ్, నొయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ సహా ఎన్సీఆర్ పరిధిలోని ప్రధాన రీజియన్లల్లో జియో 5జీ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

అన్ లిమిటెడ్ డేటా..

అన్ లిమిటెడ్ డేటా..

ఒక సెకెనుకు ఒక జీబీ ప్లస్ వేగంతో అన్ లిమిటెడ్‌గా ట్రూ 5జీ డేటాను అందిస్తోంది రిలయన్స్ జియో మేనేజ్‌మెంట్. జియో వెల్‌కమ్ ఆఫర్‌కు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో లక్షలాది మంది వినియోగదారులు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. జియో సేవలను ఇటీవలే హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రవేశపెట్టింది. ఏపీలోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో ట్రూ 5జీ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.

కొత్త ఏడాది గిఫ్ట్‌గా

కొత్త ఏడాది గిఫ్ట్‌గా

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మరో 11 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. లక్నో, తిరువనంతపురం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, డేరాబస్సిల్లో ఈ సేవలు మొదలయ్యాయి. ఇందులో- లక్నో సిటీ మినహాయించి మిగిలిన 10 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఏ సర్వీస్ ప్రొవైడర్ కూడా ఆయా నగరాల్లో తన 5జీ సేవలను ప్రారంభించలేదు.

జియో వెల్‌కమ్ ఆఫర్..

జియో వెల్‌కమ్ ఆఫర్..

అందుకే- తిరువనంతపురం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, డేరాబస్సిల్లో వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించినట్లు రిలయన్స్ జియో మేనేజ్‌మెంట్ తెలిపింది. ఎలాంటి అదనపు కాస్ట్ లేకుండా- ఆయా నగరాల్లోని జియో యూజర్లు ఇవ్వాళ్టి నుంచి గరిష్టంగా వన్ జీబీపీఎస్ ప్లస్ వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చని తెలిపింది.

 విద్యాసంస్థల్లో..

విద్యాసంస్థల్లో..

ఆయా నగరాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాలు, రెసిడెన్షియల్ ఏరియాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, జనం సమ్మర్థంతో కూడిన మార్గాలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, టెక్ పార్కులు, జాతీయ రహదారులను జియో 5జీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు జియో యాజమాన్యం తెలిపింది. విద్య, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఐటీ, చిన్న తరహా పరిశ్రమలకు మేలు కలిగేలా మరిన్ని జియో సర్వీసుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకొస్తామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+