Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జియో బంపర్ ఆఫర్: రూ.999లకే 4జీ హట్‌స్పాట్, ఒకేసారి 10 పరికరాలకు వైఫై

హైదరాబాద్: రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జియో 4జీ హట్ స్పాట్ పరికరంపై భారీ తగ్గింపు ధరను ప్రకటించింది. వెయ్యి రూపాయాల తగ్గింపును ప్రకటించింది. కేవలం రూ.999లకే 4జీ హట్‌స్పాట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి రావడమే సంచలనంగా వచ్చింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా ఇస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. అంతేకాదు అతి తక్కువ ధరకే ఫీచర్ ఫోన్‌ను కూడ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

జియో రంగ ప్రవేశంతో ఇతర టెలికం కంపెనీలు కూడ జియో మార్గంలోనే నడవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు రిలయన్స్ అనేక మార్గాలను అనుసరిస్తోంది.

కొత్త కొత్త ఆపర్లను అందిస్తూ ప్రత్యర్థి టెలికం కంపెనీలు రిలయన్స్ చుక్కలు చూపిస్తోంది. రిలయన్స్ అనుసరిస్తున్న మార్కెట్ విధానాలు ఇతర టెలికం కంపెనీలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి.

1.రూ.999లకే రిలయన్స్ జియో 4జీ హట్ స్పాట్

1.రూ.999లకే రిలయన్స్ జియో 4జీ హట్ స్పాట్

టెలికాం రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్‌ జియో.. ‘జియో ఫై' 4జీ హాట్‌స్పాట్‌ పరికరంపై అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా జియో ఫైను రూ.999కే(అసలు ధర రూ.1,999) అందిస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు ఆ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని జియో ప్రకటించింది.

4జీ ఫోన్ లేకపోయినా ఫోన్, డేటా

4జీ ఫోన్ లేకపోయినా ఫోన్, డేటా

4జీ ఫోన్‌ లేకపోయినా 4జీ వేగంతో డేటా, కాలింగ్‌ సదుపాయాలు పొందగలిగే సౌకర్యాన్ని ‘జియో ఫై' కల్పిస్తుంది. జేబులో పెట్టుకుని వెళ్లగలిగే ఈ పరికరం మార్కెట్లో ఓ సంచలనం. ‘జియో ఫై'తో 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల్లో వేగవంతమైన డేటా సేవలు పొందవచ్చు.

ఒకేసారి 10 కంప్యూటర్లకు నెట్

ఒకేసారి 10 కంప్యూటర్లకు నెట్

జియో ఫై ద్వారా ఒకేసారి 10 కంప్యూటర్లు, లేదా 10 మొబైల్స్‌కు అనుసంధానం చేసుకొనే అవకాశం ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, చిన్న సంస్థలోని ఉద్యోగులు జియో డిజిటల్‌ లైఫ్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. ఒకేసారి 10 పరికరాలు దీని నుంచి వైఫై సేవలు పొందవచ్చు.

సిమ్ కార్డు సహయంతో నెట్

సిమ్ కార్డు సహయంతో నెట్

. ప్రతి ‘జియో ఫై'కి ఒక సిమ్‌ కార్డు వస్తుంది. దీనిలో సిమ్‌ వేసిన తర్వాత ఇది వైఫై హాట్‌స్పాట్‌గా పనిచేస్తుంది. తర్వాత ‘జియో 4జీ వాయిస్‌' అప్లికేషన్‌ను ప్లే స్టోర్‌ నుంచి మీ స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్‌ యాక్టివేట్‌ కాగానే ‘జియో ఫై' ద్వారా వాయిస్‌ కాల్‌ సేవలు, 4జీ డేటా సేవలు పొందవచ్చు.
మీరు కాల్‌ సేసిన వ్యక్తికి మీ 10 అంకెల ‘జియో ఫై' నంబరు కనిపిస్తుంది.దీంతో అవతలి వ్యక్తి ఆ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. VOLTE ద్వారా 2జీ, 3జీ ఫోన్లలో వీడియో, హెచ్‌డీ కాల్స్‌ సౌకర్యం కూడా పొందవచ్చు. ‘జియో ఫై' పరికరం జియో రిటైల్‌ స్టోర్స్‌తో పాటు జియో వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+