షాక్: కొత్త ఆఫర్లతో జియో, 15 శాతం పెంచిన రూ.399 ప్లాన్
Recommended Video

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో సారి మరిన్ని ఆఫర్లతో ముందుకు వచ్చింది.ధనా ధన్ ఆఫర్లతో మరోసారి జియో దీపావళి పండుగ సంబురాలను ముందుకు తీసుకు వచ్చింది. అయితే ధనా ధన్ ఆఫర్ అయినప్పటికీ పాత రేట్లను కొంత సవరించిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.
మార్కెట్లోకి రిలయన్స్ జియో ప్రవేశమే ఓ సంచలనంగా మారింది. ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాలతో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించింది. అయితే ఏకంగా ఆరు మాసాలపాటు జియో ఉచిత ఆఫర్లను కొనసాగించింది.
ఆరు మాసాల తర్వాత జియో వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తోంది. జియో మార్కెట్లోకి ప్రవేశించి ఇప్పటికే ఏడాది దాటింది. అయితే ఇంకా అనేక కొత్త టారిఫ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది జియో.కొత్త టారిఫ్ పాత, కొత్త వినియోగదారులందరికీ వర్తింపజేయనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది.

జియో కొత్త ఆఫర్లు
రిలయన్స్ జియో మరోమారు ధన్ ధనా ధన్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. పేరుకే ధన్ ధనా ధన్ అయినా పాత రేట్లనే సవరించినట్టు తెలుస్తోంది. దీపావళి పర్వదినం నుండి కొత్త టారిఫ్ అందుబాటులోకి రానుంది. ఈ ఆఫర్లను కొత్త, పాత 4జీ వినియోగదారులు అందరూ ఊపయోగించుకోవచ్చని తెలిపింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ (ఎఫ్‌యూపీ) స్పీడ్స్ ప్రకారం హైస్పీడ్ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

రూ.149 ప్లాన్ 2 జీబీ డేటా ఫ్రీ
ఎఫ్‌యూపీ ప్లాన్లలో రూ.149 ప్లాన్‌లో ప్రస్తుతం నెలకు 2జీబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తుండగా ఇక నుంచి 4జీబీ 4జీ డేటా లభించనుంది జియో ప్రకటించింది.

.హైస్పీడ్ డేటా కోసం రూ.509 ప్లాన్
రూ.509 ప్లాన్‌తో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటాను 49 రోజుల కాలపరిమితితో ఉపయోగించుకోవచ్చని జియో ప్రకటించింది.ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు జియో యాప్స్‌ను వినియోగించుకోవచ్చు.ఇక నాన్ ఎఫ్‌యూపీ ప్లాన్లలో హై స్పీడ్ డేటాను ఇచ్చేలా జియో ప్లాన్ చేసింది. రూ.999 ప్లాన్‌లో వినియోగదారులు మూడు నెలలపాటు 60 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు.రూ.1,999 ప్లాన్‌లో ఆరు నెలల పాటు 125 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది.రూ.4,999 ప్లాన్‌లో ఏడాదిపాటు 350జీబీ హైస్పీడ్ డేటాను అందుకోవచ్చు.

5.వారానికి రూ. 52 ప్లాన్లు
డైలీ, వీక్లీ ప్లాన్లను కూడ జియో ప్రకటించింది. ఈ ప్లాన్లలో భాగంగా యూజర్లు ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్, రోజుకు 0.15 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు రూ.19 చెల్లించాలి. ఇక వారానికి రూ.52 రూపాయాల ప్లాన్ కూడ ప్రకటించింది. ఇక రెండు వారాలకు రూ.98లను చెల్లించి జియో ప్లాన్లను పొందవచ్చని రిలయన్స్ ప్రకటించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications