జియో రాకతో వినియోగదారులకు రూ.64వేల కోట్ల ఆదా, పెరిగిన తలసరి జీడీపీ
న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ నెలలో రిలయెన్స్ జియో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది వినియోగదారులకు $10 బిలియన్లను సేవ్ చేసింది. ఈ మేరకు హార్వార్డ్ బిజినెస్ స్కూల్ అనుబంధ ఐఎఫ్‌సీ (ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటెటివ్‌నెస్) నివేదిక దీనిని వెల్లడించింది.
అంతేకాదు, దీంతో పాటు తలసరి జీడీపీ కూడా పెరిగిందని పేర్కొంది. జియో మార్కెట్లోకి వచ్చిన తొలి నాళ్లలో ఉచిత డేటా అందించింది. ఆ తర్వాత తక్కువ టారిఫ్‌లతో అనేక డేటా ఆఫర్లను తీసుకొచ్చింది.

జియోకు ముందు 1జీబీ డేటాకు సగటున రూ. 152 ఉండగా, ఆ తర్వాత అది రూ.10కి పడిపోయింది. దీని వల్ల కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్ సదుపాయం చేరింది. తద్వారా వినియోగదారుల డేటా ఖర్చులు కూడా బాగా తగ్గాయి.
జియో రాక తర్వాత వినియోగదారులకు ఏటా 10 బిలియన్ డాలర్లు ఆదా అవుతున్నాయి. మన కరెన్సీలో ఇది రూ.64వేల కోట్లు. దీని వల్ల జీడీపీ 5.65% పెరిగిందట.
జియో తర్వాత భారత టెలికం మార్కెట్లో అనేక మార్పులు వచ్చాయని, జీవితకాలం పాటు ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం కల్పించి జియో ఇతర టెలికాం సంస్థలకు పోటీగా నిలిచిందని ఆ నివేదిక వెల్లడించింది.
జియో ప్రారంభమైన ఆరు నెలల్లోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటా యూజర్లు గల దేశంగా ఎదిగింది. జియోకు పోటీగా ఇప్పటికే అనేక టెలికం సంస్థలు తమ టారిఫ్‌లు తగ్గిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వినియోగదారులకు డేటా ఖర్చుల నుంచి ఊరట కలిగింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications