వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: తగ్గిన జియో చందాదారులు, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య తగ్గుతున్నట్టు కన్పిస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఆగష్టు మాసంలో గతంతో పోలిస్తే జియో చందాదారుల తగ్గింది. కేవలం 4.09 మిలియన్ కష్టమర్లను మాత్రమే ఆగష్టు మాసంలో జియోలో చేరారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్

Recommended Video

Reliance Jio Phone recharge plans, need RS 153 per month

రిలయన్స్ జియో మార్కెట్లో సంచలనాలతో ప్రారంభమైంది. ఉచిత ఆఫర్లు, ఉచిత డేటాలను ఇస్తూ రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించింది. రిలయన్స్ జియో అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

శుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియోశుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియో

అయితే అదే తరుణంలో ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను ముందుకు తెచ్చాయి. రిలయన్స్ జియో మరో తాజా ఆఫర్‌ను కూడ నవంబర్ 10వ, తేది నుండి తీసుకొచ్చింది.

తగ్గిన చందాదారుల సంఖ్య

తగ్గిన చందాదారుల సంఖ్య

రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య తగ్గుతూ వస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కంపెనీకి కొత్తగా యాడ్‌ అయ్యే సబ్‌స్క్రైబర్ల సంఖ్య నెమ్మదించింది. ఆగస్టులో నెలలో ఈ టెలికాం కంపెనీ కేవలం 4.09 మిలియన్‌ కస్టమర్లను మాత్రమే చేర్చుకుంది. లాంచింగ్‌ నుంచి కంపెనీ ఇలా తక్కువ నెలసరి వృద్ధి నమోదుచేయడం ఇది రెండో సారి. అయినప్పటికీ మార్కెట్‌ షేరును రాబట్టుకోవడంలో ఇదే ముందంజలో ఉంది.

 ప్రతి నెలా 4 మిలియన్ చందాదారులు

ప్రతి నెలా 4 మిలియన్ చందాదారులు

రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్‌లో తన సేవలను ప్రారంభించింది. ప్రతి నెలా 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను తన సొంతం చేసుకుంటూ వస్తోంది. కానీ ఏప్రిల్‌లో ఈ సంఖ్య 3.87 మిలియన్లకు పడిపోయింది. జనవరి వరకైతే ఏకంగా ప్రతినెలా 16 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను యాడ్‌ చేసుకుంది. ఫిబ్రవరి ఈ సంఖ్య 12 మిలియన్లకు, తర్వాత మార్చిలో 5.83 మిలియన్లకు, ఏప్రిల్‌లో ఆల్‌-టైమ్‌ కనిష్టం 3.87 మిలియన్లకు చేరుకుంది. కొత్త ఆఫర్లను ప్రకటించడంతో మే నెలలో ఈ సంఖ్య పెరిగింది.

టెలికం కంపెనీల చందాదారులు తగ్గారు

టెలికం కంపెనీల చందాదారులు తగ్గారు

జియోతో పాటు ఇతర టెలికం కంపెనీలకు చెందిన చందాదారులు కూడ తగ్గారని ట్రాయ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూలైలో 1186.79 మిలియన్‌గా ఉన్న మొత్తం వైర్‌లెస్‌ యూజర్‌ బేస్‌ 1185.84 మిలియన్లుగా నమోదైంది. వైర్‌లెస్‌ మార్కెట్‌లో 23.7 శాతంతో ఎయిర్‌టెల్‌ ముందంజలో ఉండగా... వొడాఫోన్‌ 17.55 శాతంతో రెండో స్థానంలో, ఐడియా 16.11 శాతంతో మూడో స్థానంలో, జియో 11.19 శాతంతో నాలుగో స్థానంలో, బీఎస్‌ఎన్‌ఎల్‌ 8.88 శాతంతో ఐదో స్థానంలో, ఎయిర్‌సెల్‌ 7.52 శాతంతో ఆరో స్థానంలో ఉన్నాయి.

 చందాదారుల సంఖ్య పెరగకుండా తగ్గింది

చందాదారుల సంఖ్య పెరగకుండా తగ్గింది

ఫీచర్‌ ఫోన్‌ లాంచ్‌ చేయడంతో సబ్‌స్క్రైబర్‌ సంఖ్య పెరుగుతుందని రిలయన్స్ జియో భావించింది. కానీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగకుండా తగ్గిందని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ ఫైసల్‌ కవోసో తెలిపారు. అయితే ఎందుకు చందాదారులు తగ్గారనే విషయమై నిపుణులు ఆరా తీస్తున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

English summary
Reliance Jio, which disrupted the telecom market since its launch last year, has started to witness a slowdown in subscriber additions while it continues to gain market share. Data from the Telecom Regulatory Authority of India (Trai) show the Mukesh Ambani-owned company added 4.09 million customers in August. This is the second-lowest monthly incremental growth for the company since its launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X