నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతి
ముంబై: బాంబే హైకోర్టులో నెస్లే ఇండియా సంస్ధకు స్వల్ప ఊరట లభించింది. భారత్లో ఇప్పటికే నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నెస్లే ఇండియా చేసిన అభ్యర్ధనకు హైకోర్టు అంగీకరిచింది.
ఈ మేరకు బాంబే హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. మ్యాగీ నూడుల్స్లో సీసం (లెడ్), మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి ఉన్నాయంటూ ఆహార భద్రత ప్రమాణాల సంస్ధ (ఎఫ్ఎస్ఎస్ఐ) తనిఖీల్లో రుజువైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మ్యాగీ ఉత్పత్తులపై జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మ్యాగీ ఉత్పత్తులన్నంటినీ ధ్వంసం చేయాలంటూ డిమాండ్ రావడంతో నెస్లే ఇండియా హైకోర్టుని ఆశ్రయించింది.
మ్యాగీ ఉత్పత్తులను ధ్వంసం చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించింది. తాజా తీర్పుతో నెస్లే ఇండియాకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications