చెన్నైలో వర్షాలు: ఆ రెండింటి తర్వాత ఇప్పుడు రికార్డ్ వర్షం

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడును వర్షాలు ముంచెత్తాయి. చెన్నై, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా ఇరవై మంది వరకు మృతి చెందారు.

రికార్డులకెక్కిన గురువారం నాటి వర్షం

రికార్డులకెక్కిన గురువారం నాటి వర్షం

గురువారం రాత్రి కురిసిన వర్షం చెన్నై చరిత్రలోనే మూడోస్థానంలో నిలిచి రికార్డుకెక్కింది. చెన్నైలో ఈశాన్య రుతుపవనాల కాలంలో నవంబరు నెలలో ఒక్కరోజులో అత్యధికంగా 1976లో 452.2 మి.మీ, 2015లో 246.15 మి.మీ వర్షపాతం నమోదవగా, ఒక్క గురువారమే చెన్నైవ్యాప్తంగా సగటున దాదాపు 180 మి.మీ. వరకు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రికార్డు వర్షపాతం

రికార్డు వర్షపాతం

రాష్ట్రంలో ఏటా ఈశాన్య రుతు పవనాల సమయంలో సగటున 750 మి.మీ వర్షపాతం నమోదవుతుండగా ఈ ఏడు అక్టోబరు 28 నుంచి నవంబరు 3వ తేదీ వరకు 441.3 మి.మీ వర్షం కురిసింది.

ఆదివారం వర్షం వస్తుందని వాతావరణ శాఖ

ఆదివారం వర్షం వస్తుందని వాతావరణ శాఖ

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం వరకు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు వణికిపోతున్నారు.

రంగంలోకి సీఎం, మంత్రులు, అధికారులు

రంగంలోకి సీఎం, మంత్రులు, అధికారులు


చెన్నైతో పాటు ఇతర తీరప్రాంతాల్లోని చాలా నివాసాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. జనజీవనం స్తంభించింది. విద్యుత్తు కష్టాలు ఉన్నాయి. 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రులు, ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అలాంటి భారీ ప్రమాదం నివారించేందుకు

అలాంటి భారీ ప్రమాదం నివారించేందుకు

2015లో వచ్చిన వరదలకు చెన్నై నగరంలో 150 మంది మరణించిన నేపథ్యంలో మరోసారి అలాంటి ప్రమాదాన్ని నివారించే క్రమంలో ప్రభుత్వం చెన్నై నగరంలోనే 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, వచ్చిన నీటిని వచ్చినట్లే వెలుపలికి పంపిస్తుండటం ఫలితమిచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The relentless rainfall over the past few days has left Chennai troubled and in a state of deja vu. Two years ago, exactly around the same time, people had watched Chennai, and some other parts of Tamil Nadu, collapse under a flood.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి