మోసం కేసు: ప్రఖ్యాత కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియా అరెస్ట్
ముంబై: భారత ప్రఖ్యాత కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు మోసం కేసులో అరెస్ట్ చేశారు. డీసీ అనే కార్ల మోడిఫికేషన్ స్టూడియోను కూడా ఛాబ్రియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ మోసం కేసులో మరికొంత మంది నిందితులున్నారని పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు చెందిన హై ఎండ్ కారును ముంబై పోలీసులు హెడ్ క్వార్టర్స్ ముందు పార్క్ చేసి ఉంచారు. మోసం, ఫోర్జరీ కేసులో కార్ల డిజైనర్ దిలీప్ ఛాబ్రియాను అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ముంబై పోలీసులు నిరాకరించారు. మంగళవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications