మార్స్ రోవర్ ఎలా పని చేస్తుందంటే..?- మ్యూజియంలో రెప్లికా ప్రదర్శన
బెంగళూరు: అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటి- మార్స్ రోవర్. అంగారక గ్రహంపై నీటి జాడను అన్వేషించడానికి 2003లో రోవర్ ఆపార్చునిటీని పంపించింది. 2004లో మార్స్‌పై ల్యాండ్ అయిన ఈ రోవర్.. 14 సంవత్సరాలకు పైగా తన కార్యకలాపాలను కొనసాగించింది. మార్స్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, డేటాను నాసాకు పంపించింది.
ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కిందీ మిషన్ మార్స్. ఈ రోవర్‌కు సంబంధించిన పూర్తిస్థాయి రెప్లికా బెంగళూరుకు చేరింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ విద్యార్థులు దీన్ని రూపొందించారు. యువతను అంతరిక్ష పరిశోధకుల వైపు ఆకర్షితులను చేయడానికి నాసా ఈ మార్స్ రోవర్ అపార్చునిటీ నమూనాను తయారు చేయించింది. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు.

యూఎస్-ఇండియా టుగెదర్ ప్రాజెక్ట్ కింద నాసా ఈ రెప్లికాను బెంగళూరుకు పంపించింది. అమెరికాలోని వర్జీనియా డల్లెస్‌లో గల స్మిత్ సోనియన్స్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో తొలిసారిగా దీన్ని ప్రదర్శించారు. అనంతరం దుబాయ్ 2020 వరల్డ్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన యుఎస్ పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచారు. దుబాయ్ నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంది ఈ మార్స్ రోవర్ రెప్లికా.
చెన్నై యుఎస్ కాన్సులేట్ జనరల్‌లో గల అమెరికన్ సెంటర్‌లో కూడా ప్రదర్శనకు ఉంచారు. తాజాగా బెంగళూరులోని విశ్వేశ్వరాయ ఇంజినీరింగ్ మ్యూజియానికి షిఫ్ట్ చేశారు. అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ మ్యారిసా లాగో దీన్ని సందర్శించారు. భారత్- అమెరికా మధ్య అనేక రంగాల్లో భాగస్వామ్యం కొనసాగుతోందని, దీన్ని అంతరిక్ష ప్రయోగాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా నాసా చర్యలు తీసుకుంటోందని అన్నారు.
యువతను అంతరిక్ష ప్రయోగాల వైపు ఆకర్షితులను చేయడానికి భారత్-అమెరికా కలిసి పని చేస్తాయని మ్యారిసా పేర్కొన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (ఎస్‌టీఈఎం)పై యువతలో ఆసక్తి పెరుగుతోందని, ఈ విషయంలో విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ మ్యూజియం.. తమకు అండగా ఉంటోందని యూఎస్ కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్ వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ తమ దేశానికి కీలక భాగస్వామిగా ఉంటోందని పేర్కొన్నారు.
విశ్వేశ్వరాయ మ్యూజియం డైరెక్టర్ కేఏ సాధన మాట్లాడుతూ మార్స్ రోవర్ అపార్చునిటీ పూర్తి స్థాయి రెప్లికాను ప్రదర్శించడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివస్తోన్నారని, అంతరిక్ష పరిశోధనలపై యువత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి నాసా నుంచి పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. బెంగళూరులో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ శంకరన్, జెట్ ప్రొపల్షన్ లాబొరేటర మిషన్ సిస్టమ్ మేనేజర్ అనా మరియా గెరెరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications