వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోంమంత్రిగా పారికర్, రక్షణ మంత్రిగా రాజ్‌నాధ్ సింగ్..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమంలో రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణం చేశారు. ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. పలువురు మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉంది. కొందరికి కేబినెట్ హోదా కల్పించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

అయితే నిన్నటి వరకు రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్ బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వినిపించిన విషయం విదితమే. రాజ్‌నాథ్‌సింగ్‌ను హోంమంత్రి నుంచి తప్పించి ఆ బాధ్యతలను పారికర్‌కు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. రక్షణ శాఖ బాధ్యతలను రాజ్‌నాథ్‌కు అప్పగించనున్నట్లు సమాచారం.

Reports That it Could be Home Minister Manohar Parrikar, Defence Minister Rajnath Singh

ప్రముఖ షూటర్ రాజవర్ధన్ సింగ్ రాథోడ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రాజవర్థన్ ప్రమాణస్వీకారం చేశారు. 2014 ఎన్నికల్లో జైపూర్ రూరల్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. తనకు కేంద్ర మంత్రి పదవి వరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2004 ఒలింపిక్స్‌లో రాథోడ్ వెండి పతకాన్ని గెలుపొందాడు.

కేంద్రమంత్రి కాబోతున్న రాజవర్ధన్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ సమర్ధులను కోరుకుంటున్నారని అన్నారు. మంత్రి వర్గంలో తనకు స్ధానం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధాని ఆశయం మేరకు పని చేసి తన ప్రతిభను నిరూపించుకుంటానని రాజవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాధ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, మేనకా గాంధీ, రాం విలాస్ పాశ్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిగత, కుటుంబ వివరాలు:
పూర్తిపేరు: మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పారికర్
జన్మదినం: 1955 డిసెంబర్ 3
జన్మస్థలం: మపూసాలీ(గోవా)
వయసు: 58
భార్య: మేధా పారికర్ (2000లో మరణం)
పిల్లలు: ఇద్దరు
విద్యార్హత: ఐఐటీ (బాంబే)
పార్టీ: బీజేపీ
రాష్ట్రం: గోవా

రాజకీయ నేపథ్యం:
1994లో గోవా అసెంబ్లీకి ఎన్నికయ్యారు
1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు
2000 అక్టోబర్ 24న గోవా ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం
2002 జూన్ 5న రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నిక (2005 వరకు)
2012 నుంచి 2014 నవంబర్ వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు
2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణం

English summary
For days, Manohar Parrikar, the 58-year-old leader from Goa, has been described as the Defence Minister-in-waiting - the reports were considered confirmed once it became clear that he had been asked by the Prime Minister to move to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X