బిగ్ బాస్ షోలో అర్దరాత్రి అరెస్టు, ఈ హీరోలు, స్వామీజీ కనపడలేదా ?, ఏం జరుగుతుందో తెలియాలి !
బెంగళూరు: పులి గోళ్లతో బంగారు నగలు (బంగారు చైన్) ధరించినందుకు గాను ఆదివారం అర్థరాత్రి అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన బిగ్ బాస్ (bigg boss) రియాల్టీ షో కంటెస్టెంట్ వర్తూరు సంతోష్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
అనంతరం అటవీశాఖ అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోందని కొన్ని సంఘాలు మండిపడుతున్నాయి. కర్ణాటక అటవీశాఖ అధికారులు స్వయం ప్రేరితంగా కేసు నమోదు చేసుకుని బిగ్ బాస్ షోలో ఉన్న వర్తూరు సంతోష్‌ను అరెస్టు చెయ్యడం వివాదానికి కారణం అయ్యింది.

అంతేకాదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వర్తూరు సంతోష్ ను అరెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ అరెస్ట్ తర్వాత చాలా మంది పులి గోళ్లను ధరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాండల్‌వుడ్ స్టార్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే వారందరికీ అటవీశాఖ అధికారులు కనీసం విచారణ నోటీసు కూడా ఇవ్వలేదని కొందరు బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
ఇంతకీ వర్తూరు సంతోష్‌ను మాత్రమే ఎందుకు అరెస్టు చేశారు?, వర్తూరు సంతోష్‌కి ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?, పులి గోళ్లతో బంగారు నగలు చేయించుకున్న వాళ్లలో కొందరు సెలబ్రిటీలు ఉండటం వలనే కర్ణాటక అటవీశాఖ అధికారులు వారిని విచారణ చెయ్యడానికి, అరెస్టు చెయ్యడానికి వెనుకడుగు వేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మేము మెడలో వేసుకున్నది పులిగోరు అని కొందరు సెలబ్రిటీలు బహిరంగంగా చెప్పిన వీడియోలు కూడా వైరల్‌గా మారింది.
అయితే అటవీశాఖ అధికారులు కనీస విచారణకు కూడా ఆ సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ అరెస్ట్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ కోర్టులో జరగనుంది. బెయిల్ దరఖాస్తు విచారణ బెంగళూరులోని కోర్టులో జరగనుంది. వర్తూరు సంతోష్ ప్రస్తుతం పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు.
పులి గోళ్లు ధరించిన రాజకీయ ప్రముఖులపై కన్నడ జనపర వేదిక ఫిర్యాదు చేయనుంది.
జనపర వేదిక నాయకుడు శివకుమార్ బెంగళూరులోని మల్లేశ్వరంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయనున్నారు. కన్నడ స్టార్ హీరోలు దర్శన్, జగ్గేష్, నిఖిల్ కుమారస్వామి, బంగారు గొలుసులలో పులి గోళ్లు ధరించారని, ప్రముఖ నిర్మాత, నటుడు రాక్‌లైన్ వెంకటేష్ కూడా పులి గోర్లతో తయారు చేసిన బంగారు గొలుసు వేసుకున్నారని, వారిని ఎందుకు విచారించలేదని ప్రశ్నిస్తున్నారు.
వీరితో పాటు పులి చర్మంపై కూర్చున్న వినయ్ గురూజీ వంటి వారి మీద తాను అటవి శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆ సంఘం నాయకులు అంటున్నారు. వీరిని పిలిచి విచారించాలని కన్నడ పీపుల్స్ ఫోరం డిమాండ్ చేస్తోంది. కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ అరెస్టు విషయం ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications