వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Republic PMARQ Exit Poll : గుజరాత్ లో మళ్లీ బీజేపీదే అధికారం- సీట్లెన్నో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై వివిధ సర్వే సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ వరుసగా ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో గుజరాత్ ఎన్నికలపై జాతీయ మీడియా సంస్ధ రిపబ్లిక్ టీవీ Republic PMARQ Exit Poll పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీకి మరోసారి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని తేలిపోయింది.

Republic PMARQ Exit Poll ఇవాళ సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ఏకంగా 128 నుంచి 148 సీట్లు సాధించి మరోసారి గుజరాత్ లో అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని తేలింది. ఆ తర్వాత స్ధానంలో ఉన్న కాంగ్రెస్ 30 నుంచి 42 సీట్లు దక్కించుకోబోతున్నట్లు తేలింది. ఇక భారీ అంచనాల మధ్య గుజరాత్ బరిలోకి దిగిన మరో పార్టీ ఆప్ మూడో స్దానంలో నిలవబోతోంది. అదీ కేవలం 2 నుంచి 10 సీట్లు మాత్రమే సాధించబోతున్నట్లు Republic PMARQ Exit Poll తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ లో ఇతరులకు మరో 0-3 సీట్లు దక్కనున్నాయి.

Republic PMARQ Exit Poll predicts bjp is set to keep gujarat again

Republic PMARQ Exit Poll సర్వేలో తెలిపిన వివరాల ప్రకారం చూస్తే గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన 99 సీట్లతో పోలిస్తే బీజేపీ మరింత మెరుగైన ప్రదర్శన చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి మాత్రం కీలక నేతల వలసలతో కుదేలైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ లో అధికారం సాధించి గుజరాత్ లోనూ హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న ఆశయంతో బరిలోకి దిగిన ఆప్ ను ఇక్కడి ఓటర్లు ఏమాత్రం నమ్మలేదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 8న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది.

English summary
republic tv's PMARQ Exit Poll predicted that bjp is set to keep gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X