India-China : పాత ఒప్పందాలు గౌరవిస్తేనే స్నేహం-చైనాకు తేల్చిచెప్పిన రాజ్ నాథ్

భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలకు గతంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాల ఉల్లంఘనే కారణమని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా రక్షణమంత్రుల మధ్య తొలిసారి జరిగిన చర్చల్లో రాజ్ నాథ్ తో పాటు జనరల్ లీ షాంగ్ ఫూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడానికి గల కారణాన్ని రాజ్ నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టేశారు.

గాల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల రక్షణ మంత్రుల తొలి సమావేశంలో భారత్ తరఫున మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్ చైనాకు గట్టి సందేశం పంపారు. సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఆవశ్యకతను నొక్కి చెబుతూ... పాత ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదిక దెబ్బతింటుందన్నారు. షాంఘై సహకార సమాఖ్య (SCO) సమావేశం సందర్భంగా జరిగిన చైనా రక్షణమంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో భేటీలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలు విషయాల్ని చర్చించారు.

India-China

వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న అన్ని సమస్యలను ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. ఇప్పటికే ఉన్న ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల యొక్క మొత్తం ప్రాతిపదికను క్షీణింపజేసిందని వెల్లడించారు. దీని వల్ల సరిహద్దులో పరిస్దితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

గతంలో కరోనా తర్వాత భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గాల్వాన్, పాంగోంగ్ సరస్సు వద్ద కొనసాగాయి. ఈ సందర్భంగా గల్వాన్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన జవాన్లు కూడా చనిపోయారు. ఆ తర్వాత భారతదేశం, చైనా సైనిక కమాండర్ల మధ్య 18 రౌండ్ల చర్చలు జరిగాయి. వీటి ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఇరుదేశాలు సైనిక బలగాల్ని ఉపసంహరించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+