మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం-రాత్రి 12 గంటల వరకూ రెస్టారెంట్లు, 11 గంటల వరకూ షాపులు

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెస్టారెంట్లు, షాపుల్ని నియంత్రిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సడలించింది. తాజా నిర్ణయం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల వరకూ రెస్టారెంట్లను, రాత్రి 11 గంటల వరకూ షాపుల్ని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

గతంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెస్టారెంట్లతో పాటు షాపుల్ని కూడా రాత్రి 10 గంటల వరకూ తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇప్పుడు పండుగల నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలు సడలించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో ఉద్ధవ్ థాక్రే సర్కార్ తాజా సడలింపులు ఇచ్చింది. అయితే రెస్టారెంట్ల యజమానులతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది కూడా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని షరతు పెట్టింది. దీంతో పాటు షాపుల్లోనూ ఇవే నిబంధనలు అమలు చేయబోతున్నారు.

restaurants in maharashtra to stay open till 12am, shops till 11 pm

కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని నివారించడానికి, సమయాన్ని నియంత్రించడం, కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండటం, సర్వీస్ ప్రొవైడర్ల అవసరాలు అలాగే సందర్శకులు పూర్తిగా టీకాలు వేయడం, ఆక్యుపెన్సీపై ఆంక్షలు మొదలైనవి వంటి ఆంక్షలు విధిస్తున్నట్లు మహారాష్ట ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు అదనపు చర్యగా, అవసరమైన సమయాలను తగ్గించడానికి స్థానిక అధికారులకు అవకాశం కల్పించారు. అయితే, ప్రత్యేక అనుమతి లేకుండా మరింత సమయం పొడిగించడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. దాని క్రమంలో, రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, దుకాణాలు, రెస్టారెంట్లు మరియు హోటళ్ల కోసం సమయ పరిమితులు మరింత రద్దీకి దారితీస్తాయని వివరించింది.

గతంలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ సమయంలో మహారాష్ట్రలో భారీగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షలు విధించక తప్పలేదు. కానీ తాజాగా కరోనా వ్యాప్తి తగ్గడం, కేసుల సంఖ్యలోనూ తగ్గుదల నమోదు కావడంతో మహారాష్ట్ర సర్కార్.. తాజా సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో పరిమిత ఆంక్షలు మాత్రం అమలు కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+