ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్-క్రమంగా మెరుగుపడుతున్న పరిస్ధితులు..
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వాయు కాలుష్యం కారణంగా గతంలో విధించిన ఆంక్షల్ని ఒక్కొక్కటిగా ఉపసంహరించుకుంటున్న ప్రభుత్వం ఇవాళ వాహనదారులకు మరో శుభవార్త చెప్పింది. గతంలో పెట్రోల్, డీజిల్ కార్ల విషయంలో విధించిన ఆంక్షల్ని ఎత్తేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత కాస్త మెరుగుపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గాలి నాణ్యత మెరుగుపడిన నేపథ్యంలో జాతీయ రాజధాని ప్రాంతంలో జీఆర్‌ఏపీ స్టేజ్ 3 కింద ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను వెంటనే రద్దు చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ-ఎన్.సి.ఆర్ గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడటంతో ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందించే నేషనల్ క్యాపిటల్ రీజియన్, అడ్జయినింగ్ ఏరియాస్ లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఇవాళ సమావేశమైంది.

ఢిల్లీలో వాయు నాణ్యతపై వెలువడుతున్న అంచనాలు అంత ఇబ్బందికరంగా లేవని తేలడంతో అమల్లో ఉన్న ఆంక్షలు ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది మరింత మెరుగుపడితే ఇతరత్రా ఆంక్షల్ని కూడా త్వరలో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఢిల్లీతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతాకాలం చలికి వాయు కాలుష్యం పెరుగుతుంటుంది. కానీ ఢిల్లీలో ప్రస్తుతానికి పరిస్దితులు మెరుగ్గానే ఉండటంతో ఆంక్షల్ని సడలిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications