వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్గెస్ట్ రెడ్‌లైట్ ఏరియా రిటైర్డ్ సెక్స్‌వర్కర్లకు సర్కార్ ఇళ్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Retired sex workers
కోల్‌కతా: రిటైరైన సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సోనాగచి ప్రాంతం ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా. ఇక్కడి రిటైర్డ్ సెక్స్ వర్కర్ల కోసం బెంగాల్ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చి ఆసరాగా నిలబడేందుకు నిర్ణయించుకుంది.

అలనాటి సెక్సు వర్కర్లు ఇప్పుడు పేదరికం, వ్యాధులతో బాధపడుతుంటారు. అలాంటి వారికి పునరావాసం కల్పించే ప్రణాళికలో భాగంగా రెండు భవంతులను నిర్మించతలపెట్టింది. ఇందులో వారికి ఆహారం, బట్టలు, షెల్టర్, హెల్త్ కేర్ తదితర అన్ని సౌకర్యాలు ఉంటాయి.

వారు తదుపరి జీవితాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి సాక్షి పంజా తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలతో సాక్షి పంజా సోనగాచి ప్రాంతంలో సర్వే చేసి 750 మంది వృద్ధులైన సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఎలాంటి వైద్య సదుపాయాలు లేకపోవడంతో వారిలో చాలామంది హెచ్ఐవితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు. దీంతో వారు భిక్షమెత్తుతున్నారు. వారి పట్ల ఎవరూ శ్రద్ధ చూపడం లేదు. దీంతో వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారికి వైద్య సదుపాయాలు, హెల్త్ కార్డ్స్, రేషన్ కార్డ్సు ఇవ్వాలని నిర్ణయించిందని సాక్షి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండు సహాయ కేంద్రాలు నిర్మించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని, అందులో దాదాపు రెండువందల మందికి పునరావాసం ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాజెక్టు సాంఘిక సంక్షేమ శాఖ చూస్తుందని తెలిపారు.

English summary
Retired sex workers from Asia's largest red-light district of Kolkata's Sonagachi, who are forced to live a life of penury after falling out of favour with customers because of advanced age, would soon be rehabilitated in a new home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X