Revenge: బెంగళూరు చరిత్రతో ఇదే మొదటిసారి, పెన్ వెపన్ తో కాలేజ్ అబ్బాయి హత్య, ఆ రోజు ? !

బెంగళూరు: కాలేజ్ లో కల్చరల్ కార్యక్రమాలలో అబ్బాయిలు చురుకుగా పాల్గోన్నారు. ఆ సందర్బంలో కాలేజ్ అబ్బాయిల మద్య గొడవ జరిగింది. తరువాత సర్దుకుపోయిన యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాలేజ్ అబ్బాయి నమాజ్ కు వెళ్లి ప్రార్థనలు చేసి తరువాత మళ్లీ కాలేజ్ కు వెళ్లాడు. కాలేజ్ లో ఉన్న యువకుడికి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి కాలేజ్ క్యాంపస్ నుంచి బయటకు పిలిపించి కాలేజ్ సమీపంలోనే దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోవడం కలకలం రేపింది. అయితే కాలేజ్ అబ్బాయి హత్యకు పెన్ వెపన్ ఉపయోగించారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఐటీ హబ్ చరిత్రలో ఓ హత్యకు పెన్ ఉపయోగించడం ఇదే మొదటిసారి అని పోలీసులు చెప్పడం కలకలం రేపింది.

 కాలేజ్ అబ్బాయి హ్యాపీ

కాలేజ్ అబ్బాయి హ్యాపీ

బెంగళూరు నగరంలోని కేజీ హళ్లిలో అర్బజ్ (18) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కేజీ హళ్లిలోని ప్రముఖ కాలేజ్ లో అర్బజ్ పీయూసీ (ఇంటర్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్న అర్బజ్ కాలేజ్ పూర్తి అయిన తరువాత అతని స్నేహితులతో కలిసి హ్యాపీగా తిరుగుతున్నాడు.

 గొడవపడిన కాలేజ్ అబ్బాయిలు

గొడవపడిన కాలేజ్ అబ్బాయిలు

అర్బజ్ చదువుతున్న కాలేజ్ లో రెండు రోజుల పాటు కల్చరల్ కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాల్లో అర్బజ్, అతని స్నేహితులు చురుకుగా పాల్గోన్నారు. ఆ సందర్బంలో కాలేజ్ అబ్బాయిల మద్య గొడవ జరిగింది. ఆ గొడవల్లో అర్బజ్ తో పాటు అతని స్నేహితులు ఉన్నారని తెలిసింది. తరువాత సర్దుకుపోయిన కాలేజ్ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 హత్యకు ముందే ప్రార్థనలు చేసిన అర్బజ్

హత్యకు ముందే ప్రార్థనలు చేసిన అర్బజ్

గురువారం కూడా అర్బజ్ తో పాటు అతని స్నేహితులతో కొందరు విద్యార్థులు గొడవపడ్డారు. ఆ సందర్బంలో కాలేజ్ లెక్చరర్స్ బుద్దిమాటలు చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. శుక్రవారం మద్యాహ్నం అర్బజ్ కాలేజ్ సమీపంలోని మసీదుకు వెళ్లి నమాజ్ చేశాడు. అర్బజ్ నమాజ్ కు వెళ్లి ప్రార్థనలు చేసి తరువాత మళ్లీ కాలేజ్ కు వెళ్లాడు.

 పక్కాస్కెచ్ తో చంపేశారు

పక్కాస్కెచ్ తో చంపేశారు

ఈనెల 11వ తేదీన అర్బజ్ అతను చదువుతున్న కాలేజ్ మూడో అంతోస్తులో ఉన్నాడు. ఆ సందర్బంలో కొందరు కాలేజ్ అబ్బాయిలు అర్బజ్ కు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిపించారు. కాలేజ్ కు సమీపంలోకి అర్బజ్ ను పిలుచుకుని వెళ్లి దారుణంగా పొడిచేశారు. తీవ్రగాయాలైన అర్బజ్ ను ఆసుపత్రికి తరలించే సమయానికి అర్బజ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కేజీ హళ్లి పోలీసులు తెలిపారు.

 డ్యాన్స్ ప్రోగ్రామ్ లో గేలి చేశారని హత్య

డ్యాన్స్ ప్రోగ్రామ్ లో గేలి చేశారని హత్య

అర్బజ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మోహమ్మద్ సాద్ ను బుధవారం బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని బీఆర్ లేఔట్ లోని కాలేజ్ లో మోహమ్మద్ సాద్ డిగ్రీ చదువుతున్నాడని పోలీసులు అన్నారు. ఆ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో మోహమ్మద్ సాద్ డ్యాన్స్ వేశాడని, ఆ సమయంలో అర్బజ్ తో పాటు అతని స్నేహితులు మోహమ్మద్ సాద్ ను ఆటపట్టించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 పెన్ వెపన్ తో కాలేజ్ అబ్బాయి హత్య

పెన్ వెపన్ తో కాలేజ్ అబ్బాయి హత్య

ఆన్ లైన్ లో పెన్ వెపన్ చూసి ఆకర్షితుడు అయిన మోహమ్మద్ సాద్ గత ఫిబ్రవరి నెలలోనే ఢిల్లీ నుంచి పెన్ వెపన్ బుక్ చేసి బెంగళూరు తెప్పించుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ లో అందరి ముందు గేలి చేసిన అర్బజ్ ను హత్య చెయ్యడానికి పెన్ ఉపయోగించాడని పోలీసులు అన్నారు.

 బెంగళూరు చరిత్రలో ఇదే మొదటిసారి

బెంగళూరు చరిత్రలో ఇదే మొదటిసారి

అర్బజ్ ను హత్య చెయ్యడానికి మోహమ్మద్ సాద్ అతని 7 మంది స్నేహితులను వెంట పిలుచుకుని వెళ్లాడని పోలీసులు అన్నారు. బెంగళూరు చరిత్రలో ఓ హత్య చెయయ్యడానికి పెన్ వెపన్ ఉపయోగించడం ఇదే మొదటిసారి అని పోలీసులు తెలిపారు. అర్బజ్ హత్య కేసులో మోహమ్మద్ సాద్ స్నేహితుల తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని కేజీ హళ్ళి పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+