Revenge: అర్దరాత్రి భార్య, అత్త గొంతు చీల్చి చంపేశాడు, స్పాట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య, బావ మిస్ !
గురుగ్రామ్/న్యూఢిల్లీ: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని పదేపదే పుట్టింటికి వెలుతోందని భర్తకు అనుమానం పెరిగిపోయింది. తన భార్య అక్రమ సంబంధం గురించి ఆమె తల్లికి తెలిసినా పట్టించుకోలేదని, ఆమె కూతురిని రెచ్చగొడుతోందని భర్త ఆవేదనతో రగిలిపోయారు. భర్తతో గొడవ పడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాది నుంచి కాపురానికి రావాలని భర్త అతని భార్యను వేడుకుంటున్నా ఆమె పట్టించుకోలేదు. నా కూతురు నీతో కాపురానికి రాదు అని అత్త తేల్చి చెప్పింది. భార్య, అత్త, బావమరిది తీరుతో భర్త రగిలిపోయాడు. స్నేహితుడిని వెంటపెట్టుకుని భార్య పుట్టింటిలోకి వెళ్లాడు. భార్య, అత్త గొంతు చీల్చేశాడు. అదే సమయంలో బావమరిది, అతని స్నేహితుడిపై రివాల్వర్ తో కాల్పులు జరిపారు. భార్య, అత్త, మరో వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బావమరిది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉన్నాడు. భర్త దెబ్బతో భార్య, అత్తతో పాటు ఒకే ఇంటిలో ముగ్గురు దారుణ హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

13 ఏళ్ల క్రితం పెళ్లి
ఫరీదాబాద్ లో నివాసం ఉంటున్న నీరజ్ (33) అనే వ్యక్తి షర్ట బటన్స్ తయారు చేసి వాటిని విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. 13 సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన అయేషా (32) అనే యువతిని పెళ్లి చేసుకున్న నీరజ్ భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. నీరజ్, ఆయేషా దంపతులకు 12 ఏళ్ల వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు. వ్యాపారం చేస్తున్న నీరజ్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు.

భార్య క్యారెక్టర్ మీద అనుమానం
వ్యాపారం చేస్తున్న నీరజ్ ఎక్కువగా బయట ఊర్లకు తిరుగుతున్నాడు. హర్యానాలోని అనేక నగరాలు, పట్టణాలు, దేశరాజధాని ఢిల్లీకి నీరజ్ ఎక్కువగా వ్యాపారం పనిమీద వెలుతున్నాడని తెలిసింది. రానురాను నీరజ్, ఆయేషా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య ఆయేషా అక్రమ సంబంధం పెట్టుకుని పదేపదే పుట్టింటికి వెలుతోందని ఆమె భర్త నీరజ్ కు అనుమానం పెరిగిపోయింది.

అత్తకు అంతా తెలుసు.... కూతురిని రెచ్చగొడుతోంది
ఆయేషా తల్లి సుమన (50)కు ఆమె కూతురి గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదని, కన్న తల్లి కూతురి అక్రమ సంబంధానికి వత్తాసు పలుకుతోందని నీరజ్ కు అనుమానం వచ్చింది. తన భార్య ఆయేషా అక్రమ సంబంధం గురించి ఆమె తల్లి సుమనకు తెలిసినా పట్టించుకోలేదని, కనీసం మందలించడం లేదని నీరజ్ ఆవేదనతో రగిలిపోయాడు.

పుట్టింటికి చెక్కేసిన భార్య
గత ఏడాది నీరజ్, ఆయేషా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఆ సమయంలో ఆయేషా ఆమె కొడుకుని పిలుచుకుని గురగ్రామ్ సమీపంలోని మొహబ్దాబాద్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది. గురుగ్రామ్ లో సమీపంలోని పుట్టింటిలో ఆయేషా, ఆమె తల్లి సుమన, సోదరుడు గగన్ (26) నివాసం ఉంటున్నారు.

భార్య కాళ్లు పట్టుకున్నాడు
గొడవ పడిన పుట్టింటికి వెళ్లిపోయిన భార్య ఆయేషాను ఇంటికి పిలుచుకుని రావాలని నీరజ్ అనేక ప్రయత్నాలు చేశాడు. పెద్దలను రాజీకి పంపించాడు. ఏడాది నుంచి కాపురానికి రావాలని నీరజ్ అతని భార్య ఆయేషాను వేడుకుంటున్నాడని సమాచారం. అయినా ఆయేషా మాత్రం పట్టించుకోలేదు. నా కూతురు నీతో కాపురానికి రాదు అని అత్త సుమన ఆమె అల్లుడు నీరజ్ కు తేల్చి చెప్పింది.

ఫ్రెండ్ తో అందరినీ చంపేయాలని స్కెచ్
నీరజ్ కు లేఖరాజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. లేఖరాజ్ సొంతంగా టైలర్ షాపు పెట్టుకున్నాడు. నీరజ్ దగ్గర షర్టు బటన్స్ కొనుగోలు చేస్తున్న లేఖరాజ్ అతనికి చాలా దగ్గర అయ్యాడు. తన భార్య ఆయేషా, ఆమె తల్లి సుమన కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని నీరజ్ అతని స్నేహితుడు లేఖరాజ్ దగ్గర ఆవేదన చెందాడు. భార్య ఆయేషా, ఆమె తల్లి సుమనను హత్య చెయ్యడానికి నువ్వు సహకరించాలని నీరజ్ అతని స్నేహితుడు లేఖరాజ్ కు చెప్పాడు. హత్యలు చెయ్యడానికి లేఖరాజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అర్దరాత్రి రివాల్వర్లు, కత్తులతో ఎంట్రీ
గురువారం అర్దరాత్రి దాటిన తరువాత 2,30 గంటల సమయంలో నీరజ్, అతని స్నేహితుడు లేఖరాజ్ రెండు కత్తులు, రెండు రివాల్వర్లు తీసుకుని ఆయేషా ఇంటికి వెళ్లారు. తరువాత ఇంటిలో చొరబడిన నీరజ్, లేఖరాజ్ కత్తులు తీసుకుని ఆయేషా, ఆమె తల్లి సుమన గొంతులు కోసేశారు. అదే సమయంలో నీరజ్ అతని బావమరిది గగన్, అతని స్నేహితుడు రాజన్ (35) మీద రివాల్వర్లతో కాల్పులు జరిపారు.

కొడుకును ప్రాణాలతో వదిలేశాడు
నిద్రలేచి ఎడుస్తున్న 12 ఏళ్ల కొడుకును ఏమీ మాట్లాడకుండా వదిలేసిన నీరజ్, అతని స్నేహితుడు లేఖరాజ్ అక్కడి నుంచి పరారైనారు. గొంతులు తెగిపోవడంతో నీరజ్ భార్య ఆయేషా, ఆమె తల్లి సుమన, వీరి ఇంటిలో ఉన్న మరో వ్యక్తి రాజన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బుల్లెట్ గాయాలైన గగన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

20 నిమిషాల్లో మూడు హత్యలు..... అర్దరాత్రి ఆ ఫ్రెండ్ ?
నీరజ్ బావమరిది గగన్ అతని స్నేహితుడు రాజన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, వీరికి గురుగ్రామ్ లోని సెక్టార్ 56లో కార్యాలయం కూడా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత నీతో మాట్లాడాలని గగన్ అతని స్నేహితుడు రాజన్ ను బలవంతంగా ఇంటికి పిలుచుకుని వెళ్లాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. మూడు హత్యలు చేసిన నీరజ్, అతని స్నేహితుడు లేఖరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయేషా ఇంటిలో హత్యకు ఉపయోగించిన కంట్రీమేడ్ రివాల్వర్ లోని నాలుగు బుల్లెట్లు చిక్కాయని పోలీసు అధికారులు అంటున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యతో డౌట్ ?
ఆయేషా, ఆమె తల్లి సుమన, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజన్ ను హత్య చెయ్యడానికి అసలు ఉద్దేశం ఏమిటి ? అని నీరజ్, అతని స్నేహితుడు లేఖరాజ్ ను విచారణ చేస్తున్నామని గురుగ్రామ్ పోలీసు అధికారులు అంటున్నారు. మాజీ సర్పంచ్ కు చెందిన ఇంటికి నెల క్రితం ఆయేషా కుటుంబ సభ్యలు అద్దెకు వచ్చారని, అంతకు ముందు వీరి ఇంటి విషయాలు మాకు తెలీవని స్థానికులు చెబుతున్నారని పోలీసు అధికారులు అంటున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications