వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Revenge: మోదీ, సీఎం వీరాభిమాని, ముస్లీం యువకుడిని వెంటాడి నరికి చంపిన ముస్లీం యువకులు, అప్పుడే !

|
Google Oneindia TeluguNews

లక్నో/ఖుషినగర్: ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దాదాపు 37 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశారు. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకున్న తరువాత రెండోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 255 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.29 శాతం ఓట్లు సంపాధించింది. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పెద్దలు అశీర్వదించారు. యోగి ఆదిత్యనాథ్ మంత్రి వర్గంలో 52 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్బంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారని సంబరాలు చేసుకున్న ముస్లీం యువకుడిని అదే ముస్లీం వర్గానికి చెందిన యువకులు కొందరు వెంటాడి వెంటాడి నరికి చంపడం కలకలం రేపింది. నువ్వు ముస్లీం మతంలో పుట్టి బీజేపీకి మద్దతు ఇస్తావా ? అంటూ ఆ యువకుడిని దారుణంగా నరికి చంపడంతో అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. తనకు ముస్లీం పెద్దలతో ప్రాణహాని ఉందని రెండు నెలల క్రితమే హత్యకు గురైన యువకుడు పోలీసు కేసు పెట్టినా అతని ప్రాణాలు మాత్రం నిలబడలేదని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Wife: నేపాల్ ఆంటీ మీద భర్తకు అనుమానం, ఐటీ హబ్ లో తేడా వచ్చిందని, నమ్మించి చంపేసిన కేటుగాడు !Wife: నేపాల్ ఆంటీ మీద భర్తకు అనుమానం, ఐటీ హబ్ లో తేడా వచ్చిందని, నమ్మించి చంపేసిన కేటుగాడు !

ఉత్తరప్రదేశ్ లో మోదీ, యోగి హవా

ఉత్తరప్రదేశ్ లో మోదీ, యోగి హవా

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దాదాపు 37 ఏళ్ల తరువాత చరిత్ర తిరగరాశారు. ఐదేళ్ల అధికారం పూర్తి చేసుకున్న తరువాత రెండోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 255 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది.

ఎమ్మెల్యే సీట్లు తగ్గినా ఓటు బ్యాంకు ?

ఎమ్మెల్యే సీట్లు తగ్గినా ఓటు బ్యాంకు ?


ఉత్తరప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41.29 శాతం ఓట్లు సంపాధించింది. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పెద్దలు అశీర్వదించారు. యోగి ఆదిత్యనాథ్ మంత్రి వర్గంలో 52 మంది మంత్రులు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు.

ముస్లీం యువకుడు యోగి వీరాభిమాని

ముస్లీం యువకుడు యోగి వీరాభిమాని

ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ లో బాబర్ అనే ముస్లీం యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్న షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న బాబర్ అతని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకుందని, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలతో తన కుటుంబం లాభపడిందని ఇప్పటికే చాలాసార్లు బాబర్ బహిరంగంగా అందరికి చెప్పాడు.

 సంబరాలు చేసుకున్న బాబర్

సంబరాలు చేసుకున్న బాబర్


ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా బాబర్ ప్రచారం చేశాడని తెలిసింది. బీజేపీ తరపున ప్రచారం చేసిన బాబర్ కు అప్పట్లోనే ముస్లీం వర్గానికి చెందిన కొందరు యువకులు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ముస్లీం మతంలో పుట్టి బీజేపీకి మద్దతు ఇస్తావా ? అంటూ రెండు నెలల క్రితం కొందరు బాబర్ మీద దాడి చేశారని తెలిసింది.

రెచ్చిపోతున్నాడని నరికి చంపేశారు

రెచ్చిపోతున్నాడని నరికి చంపేశారు


యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బాబర్ అతని షాపు మీద బీజేపీ జెండాలు కట్టి స్థానికులను స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నాడు. ఈ విషయాన్ని కొందరు ముస్లీం యువకులు జీర్ణించుకోలేకపోయారు. వ్యాపారం ముగించుకున్న బాబర్ ఇంటికి వెలుతున్న సమయంలో కొందరు ముస్లీం యువకులు కొడవళ్లు, కత్తులతో అతని వెంటాడి వెంటాడి నరికేశారు.

మోదీ, యోగికి జైకొట్టిన బాబర్ ప్రాణం పోయింది

మోదీ, యోగికి జైకొట్టిన బాబర్ ప్రాణం పోయింది

తీవ్రగాయాలైన బాబర్ తప్పించుకోవడానికి ఓ షాపు మీదకు ఎక్కాడు. షాపు మీద నుంచి కిందకులాగిన ముస్లీం యువకులు బాబర్ ను కిరాతకంగా నరకడంతో తనికి తీవ్రగాయాలైనాయి. వెంటనే బాబర్ ను రామ్ కులా జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి లక్నో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై బాబర్ ప్రాణాలు పోయాయని పోలీసులు అన్నారు.

కేసు పెట్టినా ఫలితంలేకుండా పోయింది

కేసు పెట్టినా ఫలితంలేకుండా పోయింది


బాబర్ ను దారుణంగా నరికి చంపడంతో అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. తనకు ముస్లీం పెద్దలతో ప్రాణహాని ఉందని రెండు నెలల క్రితమే హత్యకు గురైన బాబర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా అతని ప్రాణాలు మాత్రం నిలబడలేదని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Revenge: Muslim youth killed by members of his own community for celebrating BJP victory in Uttar Pradesh Assembly Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X