వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాను ఎవరి పేర్లు చెప్పలేదు.. ఎన్సీబీ కావాలనే ఇదంతా .. సీబీఐకి అప్పగించండన్న రియా

|
Google Oneindia TeluguNews

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి)కు విచారణాధికారం లేదని రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ బొంబాయి హైకోర్టుకు తెలిపారు. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై , ఆయన కుటుంబ సభ్యుల పై పలు ఆరోపణలు చేసిన రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న డ్రగ్స్ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోర్టును కోరారు. బొంబాయి కోర్టులో బెయిల్ పిటీషన్ వేసిన రియా, ఆమె సోదరుడు షోవిక్ సంచలన విషయాలు వెల్లడించారు .

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. జయసాహా సంచలనం : శ్రద్ధా కోసం డ్రగ్ ఆర్డర్ .. సుశాంత్ తాగే టీలో ఆ డ్రగ్బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. జయసాహా సంచలనం : శ్రద్ధా కోసం డ్రగ్ ఆర్డర్ .. సుశాంత్ తాగే టీలో ఆ డ్రగ్

సుశాంత్ కుటుంబం ఆయనను పట్టించుకునేవారు కాదు : రియా

సుశాంత్ కుటుంబం ఆయనను పట్టించుకునేవారు కాదు : రియా

ఎన్‌సిబి ఉద్దేశపూర్వకంగానే తనపై, తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిందని, ఈ కేసులో తమ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
రియా చక్రవర్తి తరఫున బొంబాయి కోర్టులో వాదన వినిపించిన అడ్వకేట్ సతీష్ మనేషిండే తన క్లయింట్ అమాయకురాలని వాదించారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవాడిని, సుశాంత్ కుటుంబం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేదని, అసలు సుశాంత్ ను పట్టించుకునేవారు కాదని కోర్టుకు తెలిపారు .

సుశాంత్ కు కుటుంబంపై నమ్మకం లేదు .. అందుకే దూరంగా

సుశాంత్ కు కుటుంబంపై నమ్మకం లేదు .. అందుకే దూరంగా

గతేడాది నవంబర్ మూడో వారంలో సుశాంత్ ముగ్గురు సోదరీమణులు ముంబైకి వచ్చి అతడిని వైద్య చికిత్స నిమిత్తం చండీగడ్ తీసుకువెళతామని చెప్పారని, వారి నిర్ణయానికి రియా ఎదురు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే సుశాంత్ సింగ్ మాత్రం వెళ్లడానికి నిరాకరించారని, వారు తన ఆస్తి కోసమే వచ్చారని సుశాంత్ రియా తో చెప్పాడని కోర్టుకు వెల్లడించారు. దీంతో సుశాంత్ ను ఒంటరిగానే వదిలేసి ఆయన సోదరీమణులు వెళ్లిపోయారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు రియా తరపు అడ్వకేట్.

 ఎన్సీబీకి విచారణాధికారం లేదు .. సీబీఐ కి అప్పగించండి

ఎన్సీబీకి విచారణాధికారం లేదు .. సీబీఐ కి అప్పగించండి

అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోందని, ప్రస్తుతం ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్సీబీ విచారణ మీద తమకు నమ్మకం లేదన్నారు . కావాలనే ఉద్దేశపూర్వ్తకంగా రియాను ఇరికించారని తెలిపారు . ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రియా చక్రవర్తి విచారణలో భాగంగా పలువురి పేర్లు వెల్లడించారని వార్తలు ప్రచురితమైన నేపథ్యంలో రియా చక్రవర్తి ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆ వార్తలను ఖండించారు రియా తరపు న్యాయవాది.

 ఎన్సీబీ ని కౌంటర్ దాఖలు చెయ్యాలన్న కోర్టు .. కేసు సోమవారానికి వాయిదా

ఎన్సీబీ ని కౌంటర్ దాఖలు చెయ్యాలన్న కోర్టు .. కేసు సోమవారానికి వాయిదా

ఈ కేసును విచారించిన బొంబాయి కోర్టు కూడా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయింగ్ చక్రవర్తిల బెయిల్ అభ్యర్ధనపై ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదు. ఈ కేసును సోమవారం నాటికి వాయిదా వేస్తూ ఎన్సీబీ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఎన్సీబీపైనే రియా చేసిన ఆరోపణలు, సుశాంత్ కుటుంబంపై రియా పేర్కొన్న విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు మాత్రం ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు . రియా చక్రవర్తిని ప్రధాన నిందితురాలిగా ఎన్సీబీ పేర్కొన్న విషయం తెలిసిందే .

English summary
Actor Rhea Chakraborty and her brother Showik told the Bombay High Court that being handled by the NCB should have been transferred to the CBI, which is probing the death of Mr Rajput.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X