వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ లో హవాల సోమ్ము: రూ. 20 నోట్లు అడ్వాన్, రాత్రికి రూ. 6 వేలు, అరెస్టు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో హవాలా పద్దతిలో నగదు పంపిణి చేస్తున్నారని, అడ్వాన్స్ గా రూ. 20 నోట్లు ఇచ్చి రాత్రికి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకూ పంపిణి చెయ్యడానకి సిద్దం అయ్యారని అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

RK Nagar Bypoll Updates ఆర్కే నగర్ ఉపఎన్నిక ఓటింగ్ ప్రారంభం !
ఆర్ కే నగర్ పోలింగ్

ఆర్ కే నగర్ పోలింగ్

గురువారం ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ జరుగింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే పార్టీ అభ్యర్థి మరదు గణేష్, అన్నాడీఎంకే పార్టీ రెబల్ అభ్యర్థి టీటీవీ దినకరన్, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ పలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు.

 రూ. 20 నోట్ల పంపిణి

రూ. 20 నోట్ల పంపిణి

శాసన సభ, లోక్ సభ ఎన్నికల సందర్బంగా కనీసం రూ. 500 నుంచి కొన్ని వేలరూపాయలు ఓటర్లకు పంపిణి చేసిన వేసిన విషయాలు మనం అనేకసార్లు చూసి ఉంటాము. అయితే విచిత్రంగా ఆర్ కే నగర్ లో రూ. 20 నోట్లను ఓటర్లకు పంపిణి చేశారు.

 పసిగట్టిన బీజేపీ

పసిగట్టిన బీజేపీ

గురువారం ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే మరో వైపు కొందరు ఓటర్లకు రూ. 20 నోట్లు పంపిణి చేస్తున్నారు. రూ. 20 నోట్ల మీద కొన్ని రహస్య గుర్తులు పెట్టారు. అదే సందర్బంలో రూ. 20 నోట్లు పొరపాటున కొందరు బీజేపీ కార్యకర్తలకు ఇచ్చి మేము సూచించిన వ్యక్తికి ఓటు వెయ్యాలని చెప్పారు.

 15 మంది అరెస్టు

15 మంది అరెస్టు

ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో ఓటర్లకు రూ. 20 నోట్లు పంచిపెడుతున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటర్లకు రూ. 20 నోట్లు మాత్రమే పంచిపెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు.

హవాల పద్దతి, బీజేపీ !

హవాల పద్దతి, బీజేపీ !

ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తే అనుమానం వస్తోందని టీటీవీ దినకరన్ హవాల పద్దతి ఎంచుకుని ఓటర్లకు వల వేస్తున్నారని ఆర్ కే నగర్ లో పోటీ చేస్తున్న కరు నాగరాజన్ ఆరోపించారు. కుక్కర్ కంపెనీ నాయకుడు టీటీవీ దినకరన్ ఈ ప్లాన్ వేశారని నాగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి రూ. వేలల్లో గోల్ మాల్

రాత్రి రూ. వేలల్లో గోల్ మాల్

రూ. 20 తీసుకున్న ఓటర్లకు రాత్రి వాటిని వెనక్కి తీసుకుని రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు ఇవ్వడానికి టీటీవీ దినకరన్ ముందుగానే ఒప్పందం చేసుకున్నాడని కరు నాగరాజన్ ఆరోపించారు. టీటీవీ దినకరన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశానని కరు నాగరాజన్ మీడియాకు చెప్పారు.

English summary
Police arrests 15 members who were issued Rs 20 as token in RK Nagar. BJP Candidate Karu Nagarajan alleges that Cooker Company Dinakaran has issued money by Hawala method. As he is aware of this method, he issued money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X