వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ ఆటో డ్రైవర్‌పై ఉమ్మేసిన ఆంధ్ర మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: ఓ మహిళ ఆటో డ్రైవర్‌పై దాడి చేసి, అతని ముఖంపై ఉమ్మేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎడమ పక్క నుంచి ఓవర్‌టైక్ చేసినందుకు ఆటో డ్రైవర్ ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఆమె ఆగ్రహంతో ఆ పనికి పూనుకుమంది. ఈ సంఘటన బెంగళూర్‌లోని మడివాల పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది.

సరిత అనే ఆ మహిళపై జై భువనేశ్వరి ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఆటో డ్రైవర్ ప్రశాంత్‌పై, ఇతరులపై సరిత కూడా ఫిర్యాదు చేసింది. తనను వేధించారని వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Road rage: Andhra woman assaults auto driver in Bengaluru

సరిత కారు డ్రైవర్ ప్రశాంత్ ఆటోను ఎడమ పక్క నుంచి దాటేశాడు. దాంతో గొడవ ప్రారంభమైంది. ఈ సంగఠన శనివారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో కోరమంగళ ఫస్ట్ బ్లాక్‌లోని వెంకటపుర ప్రధాన రహదారిపై జరిగింది. ఎంతగా హారన్ కొట్టినా ప్రశాంత్ దారి ఇవ్వలేదని, దీంతో అతను ఎడమ పక్క నుంచి ఓవర్ టేక్ చేశాడని చెబుతున్నారు.

ఎడమ పక్క నుంచి దాటేసిన సరిత కారు డ్రైవర్‌ను ప్రశాంత్ తిట్టాడని అంటున్నారు. దాంతో సరిత కారు ఆపాలని తన డ్రైవర్‌కు చెప్పి, కారు నుంచి దిగింది. ఆమె ప్రశాంత్ ముఖంపై ఉమ్మేయడమే కాకుండా చెంపపై కొట్టిందని ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ గురించి నీ దగ్గరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా సరిత ప్రశాంత్‌తో అన్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రశాంత్ సంఘాన్ని సంప్రదించాడని, సంఘటన గురించి చెప్పాడుి సంఘం అధ్యక్షుడు చలపతి తన ఫిర్యాదులో చెప్పాడు.

English summary
A woman has been accused of assaulting and spitting on an auto driver’s face, after the driver reportedly questioned her for overtaking from the left. The incident was reported in Madiwala police station limits on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X