రోడ్డుపై మహిళా జర్నలిస్ట్‌ను, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కొట్టారు
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ మహిళా జర్నలిస్ట్, ఆమె స్నేహితుడి పైన బుధవారం ఉదయం దాడి జరిగింది. ఓ ప్రయివేటు టీవీ ఛానల్‌లో పని చేస్తున్న సదరు జర్నలిస్ట్ పైన న్యూఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో దాడి జరిగింది.
సమాచారం మేరకు... మారుతి ఆల్టో కారులో మహిళా జర్నలిస్ట్ తన స్నేహితురాలితో కలిసి కార్యాలయం నుండి ఇంటికి బయలుదేరారు. వారు తమ నైట్ షిప్ట్ పూర్తి చేసుకొని బుధవారం ఉదయం ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ డంపర్ వీరి మారుతి ఆల్టోను ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లింది.
అనంతరం ఓ వైట్ స్కార్పియో రాంగ్ రూట్‌లో వస్తోంది. ఇరువురి వాహనాలు స్వల్పంగా గుద్దుకున్నాయి. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అంతకుముందు ఓవర్ టేక్ చేసిన డంపర్ వాహనం డ్రైవర్ కూడా స్కార్పియో వాహనంలో వస్తున్న వ్యక్తికి జత కలిశాడు.

ఇరువురు జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగారు. అనంతరం డంపర్, స్కార్పియో వాహన డ్రైవర్లు జర్నలిస్ట్, ఆమె స్నేహితుడి పైన దాడికి పాల్పడ్డారు. సదరు జర్నలిస్ట్ తేరుకునేలోపే వారు అక్కడి నుండి పరారయ్యారు.
జర్నలిస్ట్, ఆమె స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్ట్ ముందు జాగ్రత్తగా స్కార్పియో డ్రైవర్ ఫోటోను, అతని వాహనం నెంబర్ ప్లేటును ఫోటో తీశారు. దీనిని పోలీసులకు అందించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, గత వారం జరిగిన మరో ఘటనలో ద్విచక్ర వాహనం పైన వెళ్తూ.. కారును వెనక నుండి తాకినందుకు, బైక్ పైన వెళ్తున్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపారు.












Click it and Unblock the Notifications