వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ వేధింపులకు దిగదనుకుంటా: దర్యాప్తుపై రాబర్ట్ వాద్రా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన భూ వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించిన హర్యానా ప్రభుత్వం దాన్ని రాజకీయ వేధింపులకు వాడుకోదని ఆశిస్తున్నట్లు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆశించారు. తాను గానీ, తనతో సంబంధం ఉన్నవాళ్లు గానీ దాచుకోవడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

హర్యానా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని, ఏమవుతుందో చూద్దామని ఆయన ఓ ప్రకటనలో అన్నారు. అన్ని చట్టాలను పాటించినట్లు, వ్యవహారాలన్నీ పారదర్శకంగానే సాగినట్లు ఆయన తెలిపారు. దర్యాప్తును రాజకీయ వేధింపులకు వాడుకోరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Robert Vadra hopes probe into Haryana land deal will not be used for political vendetta

గుర్గావ్‌కు సంబంధించిన కమర్షియల్ కాలనీల అభివృద్ధికి లైసెన్సుల మంజూరు చేసిన ఉదంతాలపై ప్రభుత్వం విచారణకు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విచారణకు వచ్చే కంపెనీల్లో వాద్రాకు చెందింది కూడా ఉంది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ ధింగ్రా నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఆ కమిషన్ తన నివేదికను ఆరు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలపై వాద్రా కంపెనీతో పాటు తొమ్మిది కంపెనీలు పత్రాలను సమర్పించలేదని కాగ్ ఆరోపించింది.

English summary
Robert Vadra, son-in-law of Congress President Sonia Gandhi, hoped that the probe launched by Haryana government into his land deals will "not be used for political vendetta" as he insisted that neither he nor anyone associated with him had anything to hide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X