ఇటు ఫ్యామిలీ, అటు ప్రొఫెషనల్ లైఫ్ : రోహిత్ మృతికి కారణం వివరించిన ఉజ్వల ?
న్యూఢిల్లీ : రోహిత్ శేఖర్ తివారీ మృతి షాక్ కలిగించిందన్నారు ఆమె తల్లి ఉజ్వల. రోహిత్ మరణానికి వ్యక్తిగత జీవితమే కారణమని పేర్కొన్నారు. దీనికితోడు రాజకీయ ఆరంగ్రేటానికి ఇబ్బందులు ఎదుర్కొవడం కూడా ఓ కారణమని వివరించారు. రోహిత్ హత్యకు గురయ్యాడనే వార్తతో తేరుకోలేకపోతున్నానని ఆమె వివరించారు.

భార్యతో గొడవలు
రోహిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మీడియాకు వివరించారు ఉజ్వల. పెళ్లైనప్పటి నుంచి భార్య, రోహిత్ మధ్య అన్యోన్యత లోపించిందని గుర్తుచేశారు. వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలతో తల్లడిల్లిపోయాడని పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం ఇలా ఉంటే .. ప్రొఫెషనల్ లైఫ్ కూడా అంత సాఫీగా జరగలేదని తెలిపారు. రాజకీయ ఆరంగ్రేటం చేద్దామనుకునే సమయంలో ఏర్పడిన ఆటంకాలతో మరింత కుంగిపోయాడని వివరించారు. చిన్న వయస్సులోని జీవితంలో ఎదురైన ఒడిదుడుల నుంచి స్వాంతన పొందేందుకు అప్పుడప్పుడు తండ్రి సమాధి వద్దకెళ్లొచ్చవాడని పేర్కొన్నారు. రోహిత్‌ను ఎవరో హత్య చేశారనే వార్త విని షాకవుతున్నానని అని తెలిపారు.
ఆధారాల సేకరణ ?
రోహిత్ ఊపిరాడకనే చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదికలో వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి .. క్రైం బ్రాంచికి అప్పగించారు. ఫోరెన్సిక్, క్రైం బ్రాంచ్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications