సెంట్రల్ జైల్లో శశికళ కలకలం: చిన్నమ్మ ఎఫెక్ట్, డీఐజీ రూప బదిలి, ఇక నుంచి రోడ్డు మీద!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Roopa IPS transferred to Traffic department DIG

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అవ్యవహారాలను వెలుగులోకి తీసుకు వచ్చినందుకే ఐపీఎస్ అధికారి రూపను బదిలి చేశారని ప్రజలు మండిపడుతున్నారు. కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ మీద సంచలన ఆరోపణలు చేసిన రూపను సోమవారం ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ విభాగం డీఐజీగా బదిలీ చేశారు.

కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారయణ రావును బదిలి చేశారు. సత్యనారాణరావుకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆయన సెలవు మీద వెళ్లిపోయారు. సత్యనారాయణ రావు, రూపను మాత్రమే బదిలి చేస్తే లేనిపోని ఆరోపణలు వస్తాయని సిద్దరామయ్య పసిగట్టారు.

Roopa IPS transferred to Traffic department DIG

అందుకే మరి కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలి చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించారు. సత్యనారాయణ రావు, రూపతో సహ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎంఎన్. రెడ్డి, ఎన్.ఎస్ మేఘరిక్, అమృత్ పాల్ లను బదిలీ చేస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Major reshuffle in police force : D Roopa transferred to Traffic department DIG and post of Commissioner for traffic and road safety.
Please Wait while comments are loading...