రోటోమాక్ అధినేత విక్రమ్ కొఠారి, తనయుడు రాహుల్ అరెస్ట్
న్యూఢిల్లీ: రోటోమాక్ పెన్స్ అధినేత విక్రమ్ కొఠారిని అరెస్టు చేశారు. అతనితో పాటు అతని కొడుకు రాహుల్ కొఠారిని కూడా సీబీఐ గురువారం అరెస్టు చేసింది.
విక్రమ్ కొఠారి పలు బ్యాంకుల నుంచి రూ.3700 కోట్ల వరకు రుణం తీసుకున్నాడు. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఓరియెంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి రూ.3,695 కోట్లు తీసుకున్నాడు.

సీబీఐ అధికారులు గురువారం కాన్పూర్‌లోని అతని ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. విక్రమ్ కొఠారిని, అతని కొడుకును అధికారులు బుధవారం పూర్తిగా విచారించారు.
తాను బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నది వాస్తవమేనని, కానీ డబ్బులు చెల్లించలేదనడం సరికాదని కొఠారి విచారణలో చెప్పాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications