వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిఖ్‌తే లిఖ్‌తే లవ్ హో జాయే: ఎవరీ విక్రమ్ కోఠారీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పేరు ప్రఖ్యాులు గాంచిన రోటోమాక్ పెన్ అధినేత విక్రమ్ కొఠారీ కూడా చీకటి బాగోతానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన కూడా విదేశాలకు చెక్కేసినట్లు ఊహాగానాలు గుప్పుమన్నాయి. అయితే తాను ఎక్కడికీ పారిపోలేదని కొఠారీ చెప్పారు.

కొఠారీ దాదాపు 5 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు, ఇందులో ఎంత చెల్లించారో, ఎంత ఎగగొట్టారో తేలాల్సి ఉందని, అయితే, కాన్పూర్‌లోని విక్రమ్ కోఠారీ సంస్థ ప్రధాన కార్యాలయానికి నెలన్నరగా తాళం వేసి ఉందని అంటున్నారు.

ఆ కాలంలో ఓ వెలుగు...

ఆ కాలంలో ఓ వెలుగు...

లిఖ్‌తే లిఖ్‌తే లవ్ హో జాయే అంటూ 1990 దశకంలో టెలివిజన్లలో ఓ వాణిజ్య ప్రకటన వస్తుండేది. అది రోటోమాక్ పెన్నుల కంపెనీ వాణిజ్య ప్రకటన. దాని అధిపతి విక్రమ్ కొఠారీ. దానికి ముందు అనూహ్యమైన ప్రజాదరణ పొందిన మరో వాణిజ్య ప్రకటన పాన్ పరాగ్, పాన్ మసాలా.

పాన్ పరాగ్ సంస్థ అధినేతకు ఇలా...

పాన్ పరాగ్ సంస్థ అధినేతకు ఇలా...

పాన్ పరాగ్ సంస్థ అధినేత ఎంఎం కొఠారీకి ఇద్దరు కుమారులు. దీపక్ కొఠారీ, విక్రమ్ కొఠారీ. తండ్రి మరణించిన తర్వాత విక్రమ్ కొఠారీ స్టేషనరీ వ్యాపారంంలో అడుగు పెట్టారు. అప్పట్లో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు లేవు పెన్నులు తప్పనిసరిగా వాడాల్సి వచ్చేది. పెన్నులు, గ్రీటింగ్ కార్డుల వ్యాపారం ద్వారా విక్రమ్ కొఠారీ రైనాల్డ్స్ సంస్థకు తీవ్రమైన పోటీ ఇచ్చారు.

ఆయన వాణిజ్య ప్రకటనలు ఇలా...

ఆయన వాణిజ్య ప్రకటనలు ఇలా...

తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో విక్రమ్ కొఠారీ సల్మాన్ ఖాన్‌తో యాడ్స్ చేయించారు. అదే విధంగా 1995లో లిఖ్‌తే లిఖ్‌కు చేసిన సంగీతానికి అనుగుణంగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేసన చేసిన నాట్యం వాణిజ్య ప్రకటన ఇప్పటికీ మరిచిపోవడం కష్టమే. విక్రమ్ కొఠారీకి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఉత్తమ ఎగుమతిదారు అవార్డును ప్రదానం చేశారు.

ఆ తర్వాత ఇతర వ్యాపారాలు...

ఆ తర్వాత ఇతర వ్యాపారాలు...


ఆ తర్వాత విక్రమ్ కొఠారీ ఇతర రంగాల్లోకి విస్తరించారు. రోటోమాక్ ఫుడ్స్, రోటోమాక్ ప్రాగ్రెన్సెస్, రోటోమాక్ ఎక్స్‌పోర్ట్స్, మోహన్ స్టీల్స్, క్రౌన్ అల్బ రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, రేవ్ ఎంటర్‌టైన్ మెంట్స్ వంటివాటితో లక్నో, కాన్పూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్్ తదితర నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేశారు.

ఇయితే, ఇలా జరిగింది...

ఇయితే, ఇలా జరిగింది...

తాను తీసుకున్న అప్పులు విక్రమ్ కొఠారీ మెడకు చుట్టుకున్నాయి. ఒక బ్యాంకులో తీసుకున్న అప్పును మరో చోటు, మరో చోట తీసుకున్న అప్పును ఇంకో చోట రొటేట్ చేస్తూ వచ్చారు. దాంతో చివరికి రూ.600 కోట్ల చెక్ బౌన్స్ అయింది. కాన్పూర్‌లోని విక్రమ్ కొఠారీకి చెందిన మూడు ఇళ్లను వేలం వేస్తున్నట్లు అలహాబాద్ బ్యాంక్ నిరుడు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేసింది.

నేనేం పారిపోవడం లేదు...

నేనేం పారిపోవడం లేదు...

తాను కాన్పూర్ నివాసిని అని, తాను నగరంలోనే ఉంటానని విక్రమ్ కొఠారీ అన్నారు. వ్యాపారానికి సంబంధించిన పనుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను విదేశాలకు పారిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించారు.

English summary
"I am a resident of Kanpur and I will stay in the city. However, I do have to travel to foreign countries for business purposes," Mr Kothari said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X