భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసు హత్య
పుదుచ్చేరి: ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్‌బిఎన్) కానిస్టేబుల్(31) దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహానికి గురైన ఓ రౌడీ, అతని ఆరుగురు స్నేహితులు కలిసి సదరు కానిస్టేబుల్‌ను హత్య చేశారు. పుదుచ్చేరిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా, నిందితులందరూ చెన్నై కోర్టులో హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు రఘుపతి పోలీసు విభాగంలో ఏడేళ్ల క్రితం చేరాడు. మార్చి 20న అతడు తిరునవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలుందర్పేట్ దగ్గర అనుమానాస్పద స్థితిలో రోడ్డుపై చనిపోయి ఉన్నాడు. రఘుపతి కాలపేట్‌లోని పుదుచ్చేరి సెంట్రల్ జైలులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో కె నిత్యానందమ్ అనే నిందితుడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ క్రమంలో నిత్యానందమ్ భార్య సుగుణ(26) జైలులో వున్న భర్త నిత్యానందమ్‌ను చూసేందుకు తరచుగా వస్తూండేది. ఈ నేపథ్యంలో సుగుణకు సాయం చేస్తున్నట్లుగా నటించిన రఘుపతి.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న నిత్యానందమ్ తన భార్యను వివాహేతర సంబంధాన్ని తెంచుకోవాలని హెచ్చరించాడు. అంతేగాక, రఘుపతిని హత్య చేసేందుకు ప్రణాళిక వేశాడు.
కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన నిత్యానందమ్.. తన భార్యతో రఘుపతిని తన ఇంటికి పిలిపించాడు. ఇంటి వద్దకు వచ్చిన రఘుపతిని నిత్యానందమ్, అతని స్నేహితులు కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. హైవే చేరుకున్న తర్వాత ఉలుందర్పేట్ వద్ద రఘుపతిని ఐరన్ రాడ్‌తో తీవ్రంగా కొట్టి చంపారు. ఆ తర్వాత రఘుపతి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి పరారయ్యారు. అతని బైకును కూడా అక్కడే పెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
కాగా, పోలీసులు నిత్యానందమ్ భార్యను విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు నిత్యానందమ్, అతని స్నేహితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications