కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: హంతకుల ఆచూకి ఇస్తే రూ. 10 లక్షలు: రామలింగా రెడ్డి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితుల సమాచారం ఇచ్చిన వారికి రూ. 10 లక్షలు బహుమానం ఇస్తామని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. హంతకుల సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా పెడుతామని రామలింగా రెడ్డి హామీ ఇచ్చారు.

కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: ఇలాంటి వారికి ఇదే గతి, ఇంజనీర్ మల్లి అర్జున్ అరెస్టు !

శుక్రవారం హోం శాఖ మంత్రి రామలింగారెడ్డి బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. శనివారం వికాశ సౌధలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశామని, గౌరీ లంకేష్ హంతకులను అరెస్టు చేసే విషయంపై చర్చిస్తామని రామలింగా రెడ్డి అన్నారు.

Rs 10 lakh reward for the person who will give information about Gauri Lankesh's killers.

గౌరీ లంకేష్ హంతకుల వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే 09480800202 ఫోన్ నెంబర్ కు లేదా సిట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని రామలింగా రెడ్డి మనవి చేశారు. లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హంతకులను త్వరలో అరెస్టు చేస్తామని రామలింగా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 500 సీసీకెమెరాల క్లిప్పింగ్స్ ను సిట్, పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka home minister Ramalinga Reddy announces Rs 10 lakh reward for the person who will give information about Gauri Lankesh's killers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి