రాజ్యసభ ఎన్నికల దెబ్బ: కర్ణాటక మంత్రి ఇంటిలో రూ. 11 కోట్లు సీజ్, గుజరాత్ ఎమ్మెల్యేలు !

కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కార్యాలయం, నివాసాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. డీకే శివకుమార్ కార్యాలయంలో 5 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లో, కనకపురలోని మంత్రి డీకే శివకుమార్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాదాపు 11 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని ఇంటిలోనే మంత్రి డీకే. శివకుమార్ ను విచారణ చేస్తున్నారు.

Rs 11 crore recovered from DK Shivakumars house office premises during IT raid

మంత్రి డీకే. శివకుమార్ కారు డ్రైవర్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని చాళుక్య సర్కిల్ లో డీకే. శివకుమార్ కు చెందిన కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

న్యూఢిల్లీలోని డీకే. శివకుమార్ ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి పలు డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులు ఈగల్టన్ రిసార్ట్ నుంచి బయటకు వెళ్లకుండా మంత్రి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ చూసుకుంటున్నారు.

మంత్రి డీకే శివకుమార్ ను మాత్రమే టార్గెట్ చేశామని, గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చెయ్యలేదని ఆదాయపన్ను శాఖ అధికారులు మీడియాకు చెప్పారు. ఈగల్టన్ రిసార్ట్ లో డీకే. శివకుమార్, ఆయన సోదరుడు, పార్లమెంట్ సభ్యుడు డీకే. సురేష్ రెండు గదులు బుక్ చేసుకున్నారని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+