రూ.19 నోట్ల నగదు.. 3 కౌంటింగ్ మిషన్లతో లెక్కింపు.. ఐఏఎస్ సన్నిహితుల వద్ద.. ఎక్కడ అంటే..?

ఐఏఎస్, ఐపీఎస్ అయితే చాలు.. సర్వీస్ చేయడం కన్నా సంపాదనపై ఫోకస్ చేశారు కొందరు.. అందరు కాదు. అక్రమ మార్గంలో కోట్లు కొల్లగొడుతున్నారు. వారి అక్రమ సంపాదన ఎప్పుడో ఒకసారి బయట పడక తప్పదు. అలా జార్ఖండ్‌లో వెలుగుచూసింది. ఓ ఐఏఎస్ సన్నిహితుల ఇంట్లో రైడ్ చేయగా కోట్ల కట్టలు బయటపడ్డాయి. దాడి చేసిన అధికారులే నోరు తెరిచారు.

జార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పూజా సింగల్.. ఆమె సన్నిహితుల వద్ద ఈడీ అధికారులు దాడులు చేశారు. అయితే రెండు చోట్ల రూ.19 కోట్ల విలువైన నగదు పట్టుబడింది. ఈ స్కాం విచిత్రంగా వెలుగుచూసింది. జాతీయ ఉపాధి హామ పథకంలో అవినీతి, సరిగా నిర్వహించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో తీగ లాగగా.. డొంక కదిలింది.

Rs 19 crore in cash seized from aides of IAS officer

మొత్తం 19.31 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇందులో 17 కోట్లు పూజా సింగల్ సీఏ సుమన్ కుమార్ వద్ద.. మరో 1.8 కోట్లు ఇతర చోట స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో ఐఏఎస్ అధికారి ఇంటి వద్ద నేరారోపణ పత్రాలు కూడా సీజ్ చేశారు.

జార్ఖండ్ మరో 4 చోట్ల ఉపాధి హామీ పథకం అవకతవకలకు సంబంధించి దాడులు చేస్తున్నామని తెలిపింది. ఆ నగదును లెక్కించడానికి 3 కౌంటింగ్ మిషన్లను ఉపయోగించారట. వాటిలో చాలా మట్టుకు 2000, 500, 200, 100 నోట్లు ఉన్నాయి. అంతకుముందు కుంతిలో గల జూనియర్ ఇంజినీర్ రామ్ బినొద్ ప్రసాద్ సిన్హాను అరెస్ట్ చేశారు. ఇతనిపై జార్ఖండ్ విజిలెన్స్ బ్యూరో 16 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇతను 2007-08లో 18 కోట్ల ఉపాధి హామీ నగదు అవకతవకలకు పాల్పడ్డాడు. అప్పుడు జరగగా.. మళ్లీ ఇప్పుడు జరిగింది. అదే విధంగా స్కాం జరగడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+