చిల్లర కష్టాలకు చెక్: హై క్వాలిటీతో త్వరలో రూ. 200 నోటు
పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) త్వరలో రూ.200నోట్లను విడుదల చేయనుంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) త్వరలో రూ.200నోట్లను విడుదల చేయనుంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాఖలకు కొన్ని వారాల క్రితమే ఈ నోట్ల ముద్రణ అప్పగించారు.
నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో అదనపు భద్రతా ప్రమాణాలతో రూ. 200 నోట్లను ముద్రిస్తున్నారు. ప్రస్తుతం వీటిని వివిధ కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. ఈ నోట్లను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఇప్పటికే అనుమతి తెలిపింది.

Recommended Video

కాగా, రూ. 100, రూ. 500నోట్ల మధ్య రూ. 200 నోటు రావడం వల్ల ప్రజలకు రోజువారీ వ్యవహరాలు మరింత సులభతరమవుతాయని ఆర్బీఐ అధికారులు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 500, రూ. 2000 నోట్ల తర్వాత ఆర్బీఐ.. ఈ రూ. 200 కొత్త నోట్లను తీసుకు వస్తోంది.












Click it and Unblock the Notifications