వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్కూల్‌లో అదిరిపోయే అడ్మిషన్ ఫీజు.. అయినాసరే, సినీ ప్రముఖుల పిల్లలు క్యూ కడతారు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆ స్కూల్లో అడ్మిషన్ ఫీజు ఎంతో తెలిస్తేనే కళ్లు తేలేస్తారు! అక్షరాలా రూ.24 లక్షలు. అయినా సరే ఆ స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ప్రముఖులు 'క్యూ' కడుతుంటారు.

అది ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్. ముంబైలోని బాంద్రా ఈస్ట్ బీకేసీ కాంప్లెక్స్‌లో 2003లో ఈ స్కూల్ ఏర్పాటయింది. దీనిని ధీరూభాయ్ అంబానీ పెద్ద కోడలు నీతా అంబానీ నిర్వహిస్తున్నారు. ఈవిడ.. ముకేశ్ అంబానీ సతీమణి.

Rs.24 Lakhs Admission Fee in that School.. Still.. Almost Every Bollywood Star Kid Goes To This School in Mumbai

ఈ స్కూ‌ల్‌లో స్కాలర్‌షిప్ అందుకున్న విద్యార్థులు స్టాన్‌ఫోర్డ్, ప్రిన్స్‌టెన్ తదితర ఇంటర్నేషనల్ యూనివర్శిటీలలో చదువుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్కూల్‌లో 15 వేల మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ముంబైలోనే నంబర్ వన్ స్కూల్. ఐశ్వర్యరాయ్‌ బచ్చన్, షారూఖ్‌ఖాన్, అర్బజ్ ఖాన్, హృతిక్ రోషన్, కరిష్మా కపూర్ తదితర సినీనటుల పిల్లలు ఈ స్కూ‌ల్‌లోనే చదువుకుంటున్నారు.

Rs.24 Lakhs Admission Fee in that School.. Still.. Almost Every Bollywood Star Kid Goes To This School in Mumbai

హైసెక్యూరిటీ‌తో పాటు సకల సదుపాయాలు కలిగిన ఈ స్కూల్‌లో ప్రతి ఏటా వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ స్కూల్‌కు భారత్‌లో నంబర్ వన్ నేషనల్, ఇంటర్నేషనల్ స్కూలు ర్యాంకు లభించింది.

English summary
Almost Every Bollywood Star Kid Goes To This School in Mumbai, But What’s So Special About It? It's Dhirubhai Ambani International School. Established in 2003 by Nita Ambani, this K-12 school is housed in a 7 storey building with every modern amenity imaginable. This is what their annual fees looks like - LKG to Class 7 - Rs 1,70,000, Class 8 to Class 10 (ICSE) - Rs 1,85,000, Class 8 to Class 10 (IGCSE) - Rs 4,48,000, According to the Mumbai Mirror though, admission reportedly also involves a deposit of Rs.24 lakhs. The school is well known for its state-of-the-art labs and a focus on holistic education for the students. The student teacher ratio is also a lot more favourable than most Indian schools, giving them leeway to focus more on individuals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X