కిడ్నాప్: రూ. 25 కోట్లు డిమాండ్ చేసిన ఎంపీ కొడుకు
పాట్నా: స్కూల్ నుంచి ఇంటికి వెలుతున్న పాపను కిడ్నాప్ చేసిన నిందితులు రూ. 25 కోట్లు ఇస్తే వదిలిపెడుతామని, లేదంటే చంపేస్తామని బెదిరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
బీహార్ లోని కతిహార్ నగరంలో గత వారం స్పర్శ (5) అనే చిన్నారి కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. తరువాత కిడ్నాపర్లు చిన్నారిని దేశం దాటించి నేపాల్ లోని విరాట్ నగర్ సమీపంలో దాచిపెట్టారు.
రెండు రోజుల తరువాత స్పర్శ తండ్రి భాను అగర్వాల్ కు ఫోన్ చేసిన నిందితులు రూ. 25 కోట్లు ఇస్తే నీ కుమార్తెను వదిలి పెడుతామని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. హడలిపోయిన భాను అగర్వాల్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు.

చివరికి స్పర్శ తండ్రి భాను అగర్వాల్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. భాను అగర్వాల్ కు వచ్చిన ఫోన్ నెంబర్ గురించి ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ నరేష్ యాదవ్ కుమారుడు సంతోష్ యాదవ్ ఫోన్ నెంబర్ నుంచి కిడ్నాపర్లు ఫోన్ చేశారని గుర్తించారు.
సంతోష్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు. కిడ్నాపర్లు నేపాల్ లో ఉన్నారని తెలుసుకున్నారు. నేపాల్ పోలీసుల సహకారంతో పాపను క్షేమంగా విడిపించారు. భాను అగర్వాల్ పెద్ద పారిశ్రామికవేత్త. అతని కుమార్తెను కిడ్నాప్ చేసి రూ. 25 కోట్లు లాక్కోవాలని కిడ్నాపర్లు ప్లాన్ వేశారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications