ఎస్‌బీఐలో రూ. 56.40 లక్షల నగదు దోపిడీ
భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని బంకేడీ పట్టణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో దోపీడీ దొంగలు రూ. 56.40 లక్షల నగదును దోచుకెళ్లారు. హోసంగాబాద్ ఎస్పీ అశుతోష్ ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డు వచ్చి చూసేసరికి బ్యాంకు తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
వెంటనే అతను హోసంగాబాద్ పోలీసులకు సమాచారం అందించాడని తెలిపారు. బుధవారం తెల్లవారుజామున బ్యాంకులోకి దోపీడికి వచ్చిన దొంగలు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి బ్యాంకు బ్యాంకు తాళాలు పగులకొట్టి రూ. 56.40 లక్షల నగదును దోచుకెళ్లారు.

ఈ దోపిడీలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని హోసంగాబాద్ ఎస్పీ అనుమానిస్తున్నారు. నగదుతో పాటు వేరే ఇతర ముఖ్యమైన వస్తువులు ఏమైనా దొంగిలించి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications