ఇండియాను ఇక ముందు భారత్ అని పిలుద్దాము, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, ఇండియా కూటమికి !
న్యూఢిల్లీ/ గుహవాటి: ఇండియాను భారత్ అని అందరు పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ దేశంలోని ప్రజలను అభ్యర్థించారు. భారతదేశం అనే పేరుకు చారిత్రక ప్రాధాన్యత ఉందని, ఇది పురాతన కాలం నుంచి వాడుకలో ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.
గౌహతిలో సకల్ జైన సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ ప్రకటన చేశారు. మన దేశం పేరు పూర్వం నుంచి భారత్. భాషలు ఎలా ఉన్నా పేరు మాత్రం అలాగే ఉంటుంది అని మోహన్ భగవత్ అన్నారు. లెక్కలేనన్ని తరాలుగా భారతదేశం అనేది మన దేశానికి పేరు. భాషా భేదం లేకుండా ప్రజలు భారతదేశం అని పిలవడం ప్రారంభించాలి అని మోహన్ భగవత్ అన్నారు.

ఇంతలో మోహన్ భగవత్ ఐక్యత మరియు అందరినీ కలుపుకొని పోయే శక్తిని నొక్కి చెప్పారు. ప్రపంచ వేదికపై భారతదేశం ఏకం చేసే శక్తిగా వ్యవహరిస్తోందని మోహన్ భగవత్ నొక్కి చెప్పారు. భారతదేశ విద్యా వ్యవస్థపై బ్రిటిష్ వలస ప్రభావం ఉందని, దానిని తెరమరుగు చెయ్యాలని, నూతన విద్యావిధానం ద్వారా పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. భారతీయ సంస్కృతి విలువలు, సంప్రదాయాలు, కుటుంబ సూత్రాలను పిల్లలకు తెలియజేయాలని తల్లిదండ్రులను మోహన్ భగవత్ కోరారు.
భారతదేశంలోని ఎన్ డీఏ ప్రతిపక్ష కూటమికి ఇండియా' అని పేరు పెట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ కూటమి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. ఇండియా కూటమి ఇప్పటికే మూడో సమావేశాన్ని ముంబాయిలో నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్ డీఏని ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.












Click it and Unblock the Notifications