రూటుమారుస్తున్న ఆరెస్సెస్- ముస్లింలకు గాలం-సొంత వర్గం నుంచే పొంచి ఉన్న ముప్పు?
భారత్ లో మెజారిటీగా ఉన్న హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అతిపెద్ద మద్దతు దారు కూడా. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వెనక నుంచి దిశానిర్దేశం చేస్తున్న ఆరెస్సెస్ తాజాగా మైనారిటీలుగా ఉన్న ముస్లింలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
దేశంలో మెజారిటీ హిందువుల మద్దతు కలిగి ఉన్నప్పటికీ ముస్లింలను కూడా అక్కున చేర్చుకోవడం ద్వారా సర్వామోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రధాని మోడీ కూడా అవే ప్రయత్నాలను మొదలుపెట్టారు. కానీ ఈ ప్రయత్నాలకు సొంత హిందూ వర్గం నుంచే వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ముస్లింలకు దగ్గరయ్యేందుకు ఆరెస్సెస్ ప్రయత్నాలు
దేశవ్యాప్తంగా హిందూ జనాభా తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లింలు బీజేపీతో పాటు దానికి మద్దతిస్తున్న ఆరెస్సెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నిజాన్ని కొన్నేళ్ల క్రితమే గ్రహించిన ఆరెస్సెస్ వారిని కూడా తమతో పాటు కలుపుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో లౌకిక వాదిగా పేరున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రసంగం చేసేందుకు అవకాశమిచ్చిన ఆరెస్సెస్.. తాజాగా ముస్లింలను ఆకట్టుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో తన భాగస్వామి అయిన రాష్ట్రీయ ముస్లిం మంచ్ సాయం కూడా తీసుకుటోంది.

ముస్లింలు భయపడొద్దన్న మోహన్ భగవత్
దేశవ్యాప్తంగా హిందూత్వను అమలు చేసేందుకు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆరెస్సెస్.. 2014 ఎన్నికల సమయంలో అయితే మోడీకి మద్దతుగా క్షేత్రస్దాయిలో ఈ అంశాన్ని జనాల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవధను వ్యతిరేకిస్తూ ముస్లింలపై మూకదాడులు కూడా జరిగాయి. వీటిని అప్పట్లో ఖండించిన ఆరెస్సెస్.. తాజాగా మరోసారి ముస్లింలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా ఆరెస్సెస్ భాగస్వామి రాష్ట్రీయ ముస్లిం మంచ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ ఛీఫ్ మోహన్ భగవత్... కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ ముస్లింలు నివసించడానికి వీల్లేదని అంటే వారు హిందువులు కాదు. గోవు పవిత్రమైన జంతువే కానీ దాని పేరుతో దాడులకు పాల్పడేవారు మాత్రం హిందూత్వకు వ్యతిరేకమే. అలాంటి వారిపై ఎలాంటి వివక్ష, లేకుండా చట్ట ప్రకారం చర్యలుంటాయి.ముస్లింలు భయంతో జీవించాల్సిన అవసరం లేదంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

గతంలో ప్రధాని మోడీ కూడా...
గతేడాది డిసెంబర్లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన ప్రధాని మోడీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ దేశంలో ప్రతీ పౌరుడు తనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల్ని అనుభవించే విషయంలో భరోసా ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నాం. తమ మతం ఆధారంగా ఈ దేశంలో ఏ పౌరుడూ వెనుకబడరాదంటూ పౌరసత్వ చట్ట సవరణ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో తమ ఆత్మగా చెప్పుకునే ఆరెస్సెస్ బాటలోనే ప్రధాని మోడీ కూడా ముస్లింల మద్దతు సంపాదించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర చర్చ జరిగింది. ఆ తర్వాత గోవధ పేరుతో ముస్లింలపై దాడులు కూడా చాలా వరకూ తగ్గిపోయాయి.
Recommended Video

బీజేపీ, ఆరెస్సెస్ ముందు పెను సవాల్
ఆరెస్సెస్ రెండో ఛీఫ్ గోల్వాల్కర్ గతంలో ముస్లింలు తమకు శత్రువులంటూ చేసిన వ్యాఖ్యల్ని 2018లో మోహన్ భగవత్ ఖండించారు. గోల్వాల్కర్ అప్పటి పరిస్ధితుల్ని బట్టి మాట్లాడి ఉండొచ్చని కానీ, అలాంటి సందర్భోచిత వ్యాఖ్యల్ని తాము పట్టించుకోబోమని, దీర్ఘకాలం పనికొచ్చే వ్యాఖ్యలకే ఆరెస్సెస్ మద్దతిస్తుందని భగవత్ పేర్కొన్నారు. కానీ ముస్లింల విషయంలో ఆరెస్సెస్ కానీ, ప్రధాని మోడీ కానీ, బీజేపీ నేతలు కానీ తమ వైఖరి మార్చుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. అంతిమంగా ఈ విషయంలో సొంత వర్గం నుంచి పెను సవాళ్లు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది.
ఎందుకంటే దశాబ్దాలుగా నూరిపోసిన వైఖరుల్ని ఇప్పుడు ఒక్కసారిగా వీరు మార్చుకోగలిగినంతగా.. క్షేత్రస్ధాయిలో ఉన్న నాయకులు, హిందూత్వ వాదులు మార్చుకోవడం కష్టమే. అప్పుడు వారి నుంచి బీజేపీ, ఆరెస్సెస్ నేతలు వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్న అంచనాలున్నాయి.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications