వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచి న్యూస్: హత్యపై సిపిఎం నేత కుమారుడి వ్యాఖ్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

RSS worker's death is 'good news', writes Kerala CPM leader's son on Facebook
తిరువనంతపురం: కేరళ సిపిఎం నాయుకుడు పి జయరాజన్ కుమారుడు జైన్ రాజ్ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో వివాదస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గత వారం కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కెటి మనోజ్‌ని హత్యకు గురయ్యాడు.

జైన్ రాజ్ గల్ప్‌లో నివసిస్తున్నాడు. తన ఫేస్‌బుక్‌లో " ప్రియమైన కామ్రేడ్స్.. నమస్కారాలు, గత కొంతకాలంగా నేనొక మంచి వార్త వినడానికి వేచి చూశాను. సంతోషంగా ఉంది" అని రాశాడు. ఈ పోస్ట్‌ని జైన్ రాజ్ మంగళవారం మధ్యాన్నం 2.30ని. సమయంలో పోస్ట్ చేశారు.

ఆ తర్వాత బెదిరింపులు ఆరోపణలు అందుకున్న జైన్ రాజ్ తన పోస్ట్‌ని తొలగించాడు. తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లోకి ఓ వైరల్‌లా వెళ్లింది. తన తర్వాత పోస్ట్‌లలో తాను ఎందుకు అలా పోస్ట్ చేయాల్సివచ్చిందో వివరణ ఇచ్చాడు. 14 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్త మనోజ్ తన తండ్రిపై కొంతమందితో దాడి చేశాడని చెప్పాడు.

జైన్ రాజ్ పోస్ట్‌పై కేరళ బిజెపి ప్రెసిడెంట్ వి మురళీధరన్ మాట్లాడుతూ పేస్‌‌బుక్‌లో హత్యకు సంబంధించి వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదుచేయాలని అన్నారు. హత్యకు పన్నిన కుట్రలో అతని ప్రమేయం ఉండే ఉంటుందన్నారు. ఇలాంటి హంకులను అభినందించడం హేయమైనదిగా అభివర్ణించారు.

హత్యకు గురైన మనోజ్ వయసు 42. కేరళలోని కన్నూర్‌ జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా సేవలందించాడు. థాలాస్సెర్రీ వద్ద రోడ్డుపై వెళుతున్న మనోజ్‌పై ఆగంతకులు బాంబు విసిరారని పోలీసులు తెలిపారు. మనోజ్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కేసులో ఆరుగురు నిందుతులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
The son of a Kerala CPM leader is in the dock for describing as 'good news' the murder of RSS worker KT Manoj earlier this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X