వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో RTO సేవలు: డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా 18 సర్వీసులు..జాబితా ఇదే..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయంకు వెళుతున్నారా..? వాహన రిజిస్ట్రేషన్ కోసం కొన్ని మైళ్ల దూరంలో ఉండే రవాణాశాఖ కార్యాలయంకు వెళుతున్నారా.. ఇకపై ఆ కష్టం మీకు ఉండదు. ఆర్టీఓ కార్యాలయంకు వెళ్లకుండానే మీరు అన్ని అనుమతులు పొందొచ్చు. ఎలాగనుకుంటున్నారా.. కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌తో పాటు మరికొన్ని సేవలు ఆన్‌లైన్ ద్వారా పొందొచ్చంటూ ఓ సర్క్యులర్ జారీ చేసింది కేంద్ర రహదారి,రవాణా మరియు హైవే మంత్రిత్వశాఖ.

ఆన్‌లైన్ ద్వారా రవాణా సేవలు

ఆన్‌లైన్ ద్వారా రవాణా సేవలు

రవాణా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర రవాణాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇకపై వాహనదారులు రవాణాశాఖ కార్యాలయంకు వెళ్లే పనిలేకుండా పలు సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందేలా చర్యలు తీసుకుంది. అంటే కేవలం ఆధార్ వివరాలతో ఒక వాహనదారుడు తన లైసెన్స్‌ను ఆన్ లైన్‌ ద్వారా రెన్యూవల్ చేసుకునే వీలును కల్పించింది. అంతేకాదు ఆన్‌లైన్ ద్వారానే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందే అవకాశం ఇకపై వాహనదారులకు రానుంది. ఇకపై పలు రవాణాసేవలను ప్రజలకు సులభంగా అందేలా చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో మొత్తం 18 సేవలను ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ పేర్కొంటూ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఆధార్‌ ప్రామాణికతతో సేవలు

ఆధార్‌ ప్రామాణికతతో సేవలు

రవాణా సేవలను ఆన్‌లైన్ చేసేందుకుగాను, కేంద్ర రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి లభించాల్సిన అన్ని అనుమతులు వచ్చినట్లు సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది. సులభతరమైన పాలన డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా అందిస్తామని పేర్కొంది. రవాణారంగంలో ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకోవాలనుకునేవారు ముందుగా ఆధార్ ప్రామాణీకరణ చేయించుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రజలకు ఆన్‌లైన్ సేవలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున మీడియా ద్వారా ప్రచారం ఇప్పిస్తామని, పలు చోట్ల నోటీసు బోర్డులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వివరించింది. ఆన్‌లైన్ సేవలు వినియోగించుకోవాలంటే ఆధార్ ప్రామాణీకరణ ఉండాలనే అవగాహన ప్రజల్లో తీసుకొస్తామని వివరించింది. ఒక్కసారి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తే ఆర్టీఓ కార్యాలయం దగ్గర రద్దీ తగ్గుతుందని అదే సమయంలో సిబ్బంది కూడా మరింత పనిచేసేలా వెసులుబాటు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

ఆన్‌లైన్‌లో మొత్తం 18 సేవలు

ఆన్‌లైన్‌లో మొత్తం 18 సేవలు

3 మార్చి 2021 నుంచి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక 18 సేవలు ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లకుండానే వాహనదారులు ఆన్‌లైన్‌లో పొందొచ్చు. ఆ 18 ఆన్‌లైన్ సర్వీసుల జాబితా ఇదే.

1.లెర్నర్స్ లైసెన్స్

2. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్

3. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్

4. డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పై అడ్రస్ మార్పులు

5. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ

6.లైసెన్స్ ద్వారా వెహికల్ సరెండర్ చేయడం

7. మోటార్ వాహనం టెంపరరీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్

8. మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్

9. డూప్లికేట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్

10. ఆర్‌సీ ఎన్‌ఓసీ జారీకి అప్లికేషన్

11. మోటార్ వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్ నోటీసు

12. మోటార్ వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్

13. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పై అడ్రస్ మార్పు కోరుతూ సమాచారం

14.గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి డ్రైవర్ ట్రైనింగ్ పొందేందుకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్

15.డిప్లొమాటిక్ ఆఫీసర్‌కు చెందిన మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్

16. డిప్లొమాటిక్ ఆఫీసర్‌కు చెందిన వాహనం యొక్క కొత్త రిజిస్ట్రేషన్ అప్లికేషన్

17. కిరాయి-కొనుగోలు ఒప్పందం యొక్క ఆమోదం

18. కిరాయి-కొనుగోలు ఒప్పందం ముగింపు డాక్యుమెంట్

English summary
As per the Ministry of Road Transport and Highways' latest circular, citizens can now avail certain services regarding the Driving License and Certificate of Registration online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X