విదేశాలకు వెళ్లే రైళ్లు ఇవే!
విదేశీ ప్రయాణమంటే.. విమానాల్లో ప్రయాణించాల్సిందేనని చాలామంది భావిస్తారు. విమానాల్లో ఎగిరిపోవాల్సిన అవసరం లేకుండా మన రైళ్లనే ఎక్కి విదేశాలను చుట్టిరావచ్చు. ఇలా విదేశాలకు ప్రయాణించే భారతీయ రైళ్లు చాలావున్నాయి. అవన్నీ వివిధ దేశాలకు నడపుతున్నారు. కొన్ని రైళ్లను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైలులో విదేశాలకు వెళ్లానుకుంటే పాస్ పోర్టు, ప్రయాణానికి అనుమతి కలిగివుండాలి. వీటితోపాటు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు:2017లో బంధన్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. భారత్ - బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు. కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడుస్తుంది.

మైత్రి ఎక్స్‌ప్రెస్:ఈ రైలును 2008లో ప్రారంభించారు. కోల్‌కతా నుంచి ఢాకా వరకు 375 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు తప్పనిసరిగా వీసా ఉండాలి. రెండు ప్రధాన నదుల గుండా మైత్రీ ఎక్స్‌ప్రెస్ వెళుతుంది. పద్మ నదిపై 100 సంవత్సరాల నాటి హార్డింజ్ వంతెన, జమున నదిపై బంగబంధు వంతెన మీదుగా ఇది ప్రయాణిస్తుంది.
సంఝౌతా ఎక్స్‌ప్రెస్:భారత్ అట్టారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్ వరకు ఇది నడుస్తోంది. ప్రస్తుతం దీన్ని నిలిపివేశారు. దీంతోపాటు మరొక రైలు థార్ ఎక్స్‌ప్రెస్ లింక్ భారత్‌లోని జోధ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి నడిచేది. 41 సంవత్సరాల తర్వాత 2006లో దీన్ని పునరుద్ధరించారు. 2019లో నిలిపేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో సంఝౌతాను ఆపేశారు. మూడున్నర సంవత్సరాలుగా ఇది నిలిచిపోయివుంది.












Click it and Unblock the Notifications