గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా! కొత్త సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ...

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా సమర్పించారు.

గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీకి వారంతా తమ రాజీనామా లేఖలను సమర్పించారు. దీంతో గుజరాత్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా విజయ్ రూపానీని గవర్నర్ కోరారు.

vijay-rupani-resignation

గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు గుజరాత్ కొత్త సీఎం ఎంపిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎవరనే విషయం ఆదివారం తెలుస్తుందని, ఆ మర్నాడే గుజరాత్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని బీజేపీ వర్గాల సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Outgoing Gujarat Chief Minister Vijay Rupani, Deputy Chief Minister Nitin Patel and other ministers handed over their resignation to OP Kohli, Governor of Gujarat as the 13th assembly of the state dissolved on Thursday. Rupani will be working as the caretaker chief minister until the BJP decides on a new chief minister.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి