సంస్కరణలు, ర్యాంకింగ్స్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన రూపాయి విలువ

Subscribe to Oneindia Telugu

ముంబై: చాలా రోజుల తర్వాత రూపాయి విలువ బుధవారం ట్రేడింగ్‌లో భారీగా పెరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరు వారాల గరిష్టానికి ఎగిసింది. వ్యాపార సానుకూలతలో భారత్‌ ర్యాంకు ఒక్కసారిగా 100కు ఎగియడంతో, దేశీయ ఈక్విటీ మార్కెట్లు బాగా లాభపడుతున్నాయి.

  Importance of 1 Rupee in 51, 101, 501 ...Why We Gifted in Functions, Weddings - Oneindia Telugu

  ఈ క్రమంలో డాలర్‌ మారకంలో 64.67 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 64.63 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. బుధవారం ఉదయం 9.15 సమయంలో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి 64.65 వద్ద ట్రేడైంది. అంటే మంగళవారం ముగింపుకు 0.15 శాతం ఎక్కువ. రూపాయి విలువతో పాటు బీఎస్‌ఈ బెంచ్‌ మార్కు సూచీలు కూడా బాగా సరికొత్త రికార్డు స్థాయిలను నమోదుచేస్తున్నాయి. కాగా, సెన్సెక్స్ 33,500 పాయింట్లకు పైకి ఎగిసింది.

   Rupee jumps to 64.63 on 'ease of doing business' ranking

  నిఫ్టీ కూడా ఆల్‌-టైమ్‌ హై 10,400 మార్కును క్రాస్‌ చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి రూపాయి విలువ 4.7 శాతం లాభపడింది. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 5.81 బిలియన్‌ డాలర్లను ఈక్విటీలో, 22.54 బిలియన్‌ డాలర్లను డెట్ రూపంలో కొనుగోలు చేశారు. భారత్‌లో వ్యాపారం చేయడానికి అనువైన పరిస్థితులు (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వేగంగా మెరుగుపడుతున్నట్టు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక పేర్కొంది.

  మంగళవారం విడుదల చేసిన నివేదికలో గత ఏడాది 130గా ఉన్న భారతదేశ ర్యాంక్‌ ఈ ఏడాది ఒక్కసారిగా 100కు ఎగసింది. ఇది భారత పెద్ద విజయమనే చెప్పాలి. పన్నులు, లైసెన్సింగ్‌ వ్యవస్థలో సంస్కరణలతో పాటు పెట్టుబడిదారు ప్రయోజనాల పరిరక్షణ, దివాలా సమస్యల సత్వర పరిష్కారం వంటి అంశాల్లో భారత్‌ వేగంగా పురోగమించడం ఈ ర్యాంక్‌ మెరుగుదలకు దోహదపడిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొనడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The rupee today positively reacted to India’s jump on Ease of Doing Business ranking by rising 12 paise to 64.63 against the dollar. The World Bank’s list was released yesterday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి