రష్యా-ఉక్రెయిన్ వార్... భారత్‌కు అలా కలిసొచ్చింది!!
అనూహ్య పరిణామాల మధ్య ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ ను దాదాపుగా నేలమట్టం చేసేదిశగా రష్యా సైన్యం ముందుకు వెళుతోంది. ప్రపంచ దేశాలు ఎంత ప్రయత్నించినప్పటికీ రష్యా యుద్ధం చేయడాన్ని విరమించేది లేదని స్పష్టం చేయడంతో ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అన్ని అంశాలను బేరీజు వేసుకొని బరిలోకి దిగిన రష్యా ఆంక్షలపై ప్రారంభంలో తడబడినప్పటికీ భారత్ చేయూతతో కోలుకుంది. రాయితీ ధరపై చమురును అందిస్తుండటంతో రష్యాలోని చమురు కంపెనీలకు కలిసివచ్చింది. యుద్ధ ప్రభావంతో గతంలో కంటే ఎక్కువగా భారత్ రష్యా నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్, మేలో రష్యా దిగుమతులు 3.7 రెట్లు పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరాయి. తాజాగా ఈ రెండు నెలల కాలంలో జరిగిన దిగుమతులు ఏడాది దిగుమతుల్లో సగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 8.6 బిలియన్ డాలర్ల వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. 2021లో ఇది 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. వంటనూనెలు, బొగ్గు, ముడి చమురు, ఎరువులు ఉన్నాయి. ఖరీదైన రాళ్లు, వజ్రాలు వంటి దిగుమతులు మాత్రం తగ్గాయి.

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలను రష్యా ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు. రాబోయేది శీతాకాలం కావడంతో ఐరోపా దేశాల్లో చలిని తట్టుకునేందుకు ఇళ్లను వెచ్చగా ఉంచుతారు. దీనికి సంబంధించిన గ్యాస్ ను రష్యా ఎక్కువగా సరఫరా చేస్తుంది. తాజాగా జర్మనీకి రష్యా గ్యాస్ సరఫరాను ప్రారంభించడంతో ఐరోపా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. రష్యాకు సంబంధించి అన్నిరకాలుగా ఆధారపడ్డ దేశాలు ఏమాత్రం స్పందించలేకపోతున్నాయనేదానికి ఇదే ఒక ఉదాహరణ.












Click it and Unblock the Notifications