వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్దానికి నెల రోజులు - లక్ష్యాన్ని చేరుకోని రష్యా : భారత్ పై ప్రభావం - నష్టం ఏ మేర..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభించి నెల రోజులు పూర్తయింది. కానీ, ఇంకా పుతిన్ తన లక్ష్యం చేరుకోలేదు. యుద్దం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రపంచ దేశాలు యుద్దం ఆపాలని డిమాండ్ చేసాయి. రష్యా పైన ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ కు బాసటగా నిలిచాయి. మూడు విడతల చర్చలు జరిగాయి. కానీ, యుద్దం ఆగలేదు. ఇదే సమయంలో భారత్ తటస్థ వైఖరి తీసుకుంది. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ విషయంలో న్యూట్రల్ గా వ్యవహరించింది. ఆ తరువాత అమురికా అధ్యక్షుడు బైడెన్ భార్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్ రష్యా వ్యతిరేక నిర్ణయాల విషయంలో వణుకుతోందని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాన బోరిస్ నేరుగా ప్రధానితో చర్చించారు. అయితే, ఈ యుద్దం ఎంతో నష్టాన్ని మిగిల్చింది.

ఉక్రెయిన్ ను తక్కువ అంచనాలతో

ఉక్రెయిన్ ను తక్కువ అంచనాలతో

రష్యా యుద్ద ఆరంభంలో ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసింది. ఉక్రెయిన్ శక్తి మేర రష్యాకు బదులిస్తోంది. రష్యా సైతం మిసైల్స్ తో తమ దేశం పైన విరుచుకు పడుతున్నా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ- బలమైన శత్రువును ఎదుర్కొనేందుకు ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశారు. తాను దేశం విడిచి పారిపోయేది లేదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. రష్యా దాడుల తీవ్రతను పెంచుతూ వచ్చింది. ఆఖరికి అత్యంత శక్తిమంతమైన హైపర్‌ సోనిక్‌ క్షిపణుల్నీ ప్రయోగిస్తోంది. అనేక నగరాలను నేల మట్టం చేసింది. యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధ సంపత్తితో పాటుగా మానవతా సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి వస్తున్న ప్రతిఘటనతో రష్యా సేనలు అణువిద్యుత్కేంద్రాలు, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా మార్చుకున్నాయి.

ఒత్తిడి..ఆంక్షలకు లొంగని పుతిన్

ఒత్తిడి..ఆంక్షలకు లొంగని పుతిన్

64 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్‌ను కీవ్‌ శివార్లకు తరలించినా, రాజధానిలోకి చొచ్చుకు వెళ్లడం కుదరలేదు. మాస్కో సేనలు ఇప్పటికీ కీవ్‌కు వాయువ్యంగా 15 కి.మీ. దూరంలో, తూర్పున 30 కి.మీ. దూరంలో నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో గంట సమయం కూడా పట్టని ఈ ప్రయాణాన్ని.. పుతిన్‌ బలగాలు నాలుగు వారాలైనా పూర్తిచేయలేకపోయాయి. యుద్దం కారణంగా దాదాపు 35 లక్షల మంది ఆ దేశం వీడారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు దాదాపుగా రూ 8.42 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అదే విధంగా 691 మంది పౌరులు మరణించినట్లుగా తేల్చింది. యుద్దంలో 1500 మంది రష్యా సైనికులు మరణించినట్లుగా ఉక్రెయిన్ చెబుతోంది. రష్యా పైన ఒత్తిడి పెంచేందుకు అమెరికా సహా యూరోపియన్ యూనియన్ అనేక ఆంక్షలు అమలు చేస్తోంది. అయినా, పుతిన్ లొంగటం లేదు.

ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర

ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర

దీంతో..ఒక వైపు చర్చల పేరుతో సానుకూల సంకేతాలు ఇస్తూనే..మరో వైపు కీవ్ ను స్వాధీనం చేసుకొనే విధంగా పుతిన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు. చెర్నిహైవ్‌లో కొంత భాగాన్ని, అక్కడి అణు విద్యుత్‌ కేంద్రాన్ని పుతిన్‌ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇక, భారత్ యుద్దం కాకుండా.. చర్చల ద్వారా పరిష్కారం రావాలనేదే తమ విధానమని భారత్ ఐక్యరాజ్య సమితి వేదికగా స్పష్టం చేసింది. రష్యా - ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడారు. ఇద్దరు అధ్యక్షులు నేరుగా మాట్లాడుకోవటం ద్వారా పరిష్కారం దొరుకుతుందని సూచించారు. ఇక, రష్యా నుంచి భారత్ ఇంధన కొనుగోళ్లు.. పరోక్ష మద్దతు పైన అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసారు.

Recommended Video

Russia Offer To India: Ukraine యుద్ధంతో India కు లాభం Reliance కు ఇబ్బందులు | Oneindia Telugu
బైడెన్ కీలక వ్యాఖ్యలు.. భారత్ వ్యూహాత్మకంగా

బైడెన్ కీలక వ్యాఖ్యలు.. భారత్ వ్యూహాత్మకంగా

ఆ మరుసటి రోజునే బ్రిటన్ ప్రధాని భారత్ ప్రధానితో చర్చించారు. కలిసి పని చేద్దామని ఆహ్వానించారదు. బైడెన్ వ్యాఖ్యల తరువాత..భారత్ పరిస్థితిని అర్దం చేసుకోగలమంటూ సర్దుబాటు ప్రకటన వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ముందుగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించటంలో అనుసరించిన వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. భారత్ కు చెందిన ఒక విద్యార్ది మరణించాడు. తాము ఏ దేశానికి అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదని.. యుద్దం సరైన మార్గం కాదనే విధానాన్ని భారత్ స్పష్టం చేస్తోంది. భారత్ అనుసరిస్తున్న మార్గాన్నే అటు చైనా.. యూఏఈ దేశాలు సైతం అనుసరిస్తున్నాయి.

English summary
A month has gone for Russias invasion over Ukraine but putin has not reached his goal, this has an impact on india too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X