రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాద్ మిర్ పుతిన్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. 19వ భారత-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కోసం అక్టోబరు 4,5 తేదీల్లో పుతిన్ ఢిల్లీకి రానున్నారు.

ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులతో పుతిన్ అధికారికంగా సమావేశం కానున్నట్లు భారత విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది జూన్ 1న జరిగిన ఇరుదేశాల వార్షిక ద్వైపాక్షిక సమావేశానికి మోడీ రష్యా వెళ్లారు.
2000లో పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరినప్పటి నుంచి భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం పుతిన్ పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయనున్నాయి. ఇరు దేశాల మధ్య సహాయసహకారాలకు తోడ్పాటునందించనున్నాయి.












Click it and Unblock the Notifications