Sabarimala:కేరళలో రెడ్ అలర్ట్, బురేవి తుపాన్, అయ్యప్ప భక్తులు జాగ్రత్త, స్వామి తోడు, స్వామియేశరణమయ్యప్ప!
శబరిమల/ కొచ్చి/ పతనంపట్టి: శబరిమలకు వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులకు ఇప్పుడు బురేవి తుపాను రూపంలో మరో సమస్య ఎదరైయ్యింది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని లెక్క చెయ్యకుండా శబరిమలకు స్వామియే శరణమయ్యప్ప అంటూ వెలుతున్న అయ్యప్ప భక్తులు రెండు రోజులు భారీ వర్షాలు పడతున్న సందర్బంగా మరోసారి కష్టాలను లెక్క చెయ్యకుండా ముందుకు వెలుతున్నారు. కేరళలో ఈనెల 2, 3వ తేదీల్లో భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా ఇప్పటికే అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

అయ్యప్ప భక్తులకు ఆన్ లైన్ సమస్యలు
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కేరళ ప్రభుత్వం అయ్యపస్వామి భక్తులకు ఇప్పటికే అనేక నియమాలు విధించింది. అతి కష్టం మీద కేరళ ప్రభుత్వం విధించిన రూల్స్ పాటిస్తూ ఆన్ లైన్ లో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి అనుమతి తీసుకుంటున్న అయ్యప్ప భక్తులు శబరిమలకు వెలుతున్నారు. శబరిమలలో అయ్యపస్వామిని దర్శించుకుంటున్న అయ్యప్పస్వామి భక్తులు తరువాత మొక్కులు చెల్లించుకుని వెనుతిరుగుతున్నారు.

నివర్ కాదు మరో బురేవి తుపాను దెబ్బ
నివర్ తుపాను కారణంగా ఇప్పటికే అయ్యప్పస్వామి భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈనెల 2వ తేదీ, 3వ తేదీల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నివర్ తుపాను వెళ్లిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి బురేవి తుపాను రూపంలో భారీ వర్షాలు పడుతాయని తెలియడంతో అయ్యప్పస్వామి భక్తులు కొంత ఆందోళనకు గురౌతున్నారు.

కేరళలో రెడ్ అలర్ట్
కేరళలోని తిరువనంతపురం, కోల్లాం, పతనంతిట్ట, అళప్పళ జిల్లాల్లో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలో 3 సె.మీ. నుంచి 20 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. కేరళలోని ఎర్నాకుళం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో 6 సె.మీ. నుంచి 11 సె.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండటంతో ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు.
Recommended Video

అయ్యప్ప భక్తులు జాగ్రత్త
రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడటంతో శబరిమలకు వచ్చి వెలుతున్న అయ్యప్పస్వామి భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని శబరిమల దేవస్వం బోర్డు, కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు మనవి చేసింది. ఏది ఏమైనా సరే ముందుగా ఆన్ లైన్ లో డేట్ ఫిక్స్ చేసుకున్న అయ్యప్ప భక్తులు అనుకున్న సమయానికి అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించారు. అయ్యప్పస్వామి తోడుగా ఉంటే మాకు ఏమీ కాదని, శబరిమలకు వెళ్లి వస్తామని అయ్యప్ప భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications